ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,సెప్టెంబర్ 13: చేవెళ్ల మండల పరిధిలోని దామరగిద్ద గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం ప్రహరి గోడ నిర్మాణం కోసం భూమి పూజ ఎమ్మెల్యే కాలే యాదయ్య చేశారు. అనంతరం రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆర్ధిక వ్యవస్థలో కీలకమైన కుల వృత్తులను కాపాడుకోవడమే సీఎం ధ్యేయం అని కాలే యాదయ్య అన్నారు.దామరగిద్ద గ్రామంలో గొల్ల కురుమలకు 5 యూనిట్ల లబ్ధిదారులకు 8 లక్షల75 వేల రూపాయలు విలువ గల 100 గొర్రెలు 5 గొర్రె పొట్టేలు పిల్లలను అంద చేసిన ఎమ్మెల్యే కాలే యాదయ్య.గొల్ల కురుమల జీవితాల్లో ఆర్థిక అభివృద్ధి పెరుగుదల కోసం గొల్ల కురుమల అభివృద్ధి ధ్యేయంగా గొర్రెల పంపిణీ సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టారు.మన తెలంగాణ అభివృద్ధికి ముఖ్య కారణం ముఖ్యమంత్రి కెసిఆర్ అని హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే యాదయ్య అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి రమణారెడ్డి,జడ్పిటిసి మాలతి కృష్ణారెడ్డి,వైస్ ఎంపీపీ కర్నె శ్రీశైలం,దామరగిద్ద సర్పంచ్ మధుసూదన్ గుప్తా,మండల పార్టీ అధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్,దామరగిద్ద బిఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.