సంగారెడ్డి, ప్రజాతంత్ర, అక్టోబర్ 27: సదాశివపేట మండలం వెల్టూర్ గ్రామంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో శుక్రవారం భారీగా చేరిన యువకులు గ్రామస్తులు చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి గెలుపు నకు కృషి చేస్తామన్నారు. ఈ సందర్బంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సోనియా గాంధీ గారు చెప్పిన్నవని అమలు చేస్తారని అన్నారు.ఇచ్చిన హామీలు అమలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ దే అని తెలిపారు.గతంలో 10 ఏళ్లు అధికారంలో ఉన్నపుడు చేసాము, ఇప్పుడు అధికారంలోకి రాగానే చేస్తామని అన్నారు.బీఆర్‌ఎస్ నమ్మకం ఏంటంటే ఎన్నికల మూడు రోజుల ముందు 1000, బాటిల్ ఇస్తే వేస్తారు అనే ఆలోచనలే ఉన్నారని అన్నారు.ఇక్కడ కాంగ్రెస్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బెల్ట్ షాప్ లు ఎత్తివేస్తామని తెలిపారు.తాగే వాళ్ళు కోపం వచ్చిన సరే బెల్ట్ షాప్ లు తీసేస్తామన్నారు.5 ఏళ్లకు బీఆర్‌ఎస్ ఇచ్చే 1000 కావాలో లేదా సోనియా గాంధీ గారు ఇంట్లో ప్రతి మహిళకు ఇస్తానన్న 2500 కావాలా మీరు ఆలోచించుకోవాలని అన్నారు.
ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి రూ. 4వేల పెన్షన్ ఇస్తామని సోనియా గాంధీ గారు చెప్పారని అన్నారు.సోనియా గాంధీ గ్యాస్ సిలిండర్ 500 కే ఇస్తామని చెప్పారని అన్నారు.సోనియామ్మ చెప్పిన తర్వాత కేసీఆర్ 400 కే ఇస్తామన్నారని తెలిపారు.ఈ నాలుగేళ్ళు ఎందుకు ఇవ్వలేదు మరి ఆలోచన చేయండని అన్నారు.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి మహిళకి ఆర్టీసి లో ఉచిత ప్రయాణం ఉంటుందని అన్నారు. రైతులకు ఎకరానికి 15వేలు, కౌలు రైతుకు 12వేలు ప్రభుత్వం ఇస్తదని అన్నారు.అలాగే వారి పండిస్తే 500 రూపాయల బోనస్ ఉంటుందని తెలిపారు.
చదువుకునే ప్రతి విద్యార్థికి 5 లక్షల కార్డు, ఆరోగ్య లక్ష్మి రూ. 10 లక్షల వరకు ట్రీట్మెంట్ చేసుకోవచ్చ ని అన్నారు. వీటన్నిటిని సోనియా గాంధీ కాంగ్రెస్ అధికారంలో కి రాగానే అమలు చేస్తామని చెప్పారు చేస్తామని తెలిపారు.ప్రజలు ఆలోచన చేయండి అని కోరారు.నియోజకవర్గం లో కాంగ్రెస్ రాష్ట్రంలో కాంగ్రెస్ వస్తే అన్ని హామీలు నెరవేరుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలోడిసిసి అధ్యక్షురాలు నిర్మలా రెడ్డి కాంగ్రెస్ నాయకులు రాంరెడ్డి సత్యనారాయణ జిల్లా జనరల్ సెక్రటరీ కంది కృష్ణ, పట్నం సుభాష్, మండల అధ్యక్షుడు సిద్దన్న, సంగమేశ్వర్, మగ్దుం పటేల్, చిరు, మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.