ఎల్. బి నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 4: ఎల్. బి నగర్ నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యమని ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. హయత్ నగర్ డివిజన్లో రూ. 9 కోట్ల 50 లక్షల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనుల కు ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. భారత్ బెంజ్ షోరూం నుండి జగదాంబ కాలనీ మీదుగా రాఘవేంద్ర నగర్ వరకు సేవరేజ్ ,నేషనల్ హైవే కాలనీ నుంచి జగదాంబ కాలనీ వరకు నూతన సీ.సీ.రోడ్డు పనులు ,శారద నగర్ కాలనీ నందు 300 ఏం.ఏం.డయా ఎస్.డబ్ల్యూ.జీ.పనులకు శంకుస్థాపన,ముదిరాజ్ కాలనీ నందు 300/250 ఏం.ఏం.డయా యూ.జీ.డి.పనులకు ,పీ అండ్ టీ కాలనీ నందు యూ.జీ.డి.పైప్ లైన్ల కొరకు , సాయిబాబా కాలనీ నందు 200 ఏం.ఏం.డయా ఎస్.డబ్ల్యూ.జీ.పనులకు, హనుమాన్ నగర్ నందు యూ.జీ.డి.పనులకు,విద్యానగర్ కాలనీ నందు యూ.జీ.డి. పనులకు ,లక్ష్మీప్రియ కాలనీ నందు 450 ఏం.ఏం.డయా.ఆర్.సి.సి.ట్రంక్ లైన్ పనులకు,గజ్జి పుల్లయ్య కాలనీ నందు 200 ఏం.ఏం.డయా ఎస్.డబ్ల్యూ.జీ.పనులకు ,సత్యనారాయణ కాలనీ నందు యూ.జీ.డి.పనులకు,మారం అపార్ట్మెంట్ వెంకటాద్రి కాలనీ నుంచి గాయత్రి నగర్ కాలనీ వరకు నూతన సీ.సీ.రోడ్డు పనులకు ,సావిత్రి భాయ్ పూలే కాలనీ నందు 200 ఏం.ఏం.డయా యూ.జీ.డి.పనులకు సూర్య నగర్ కాలనీ నందు 200 ఏం.ఏం.డయా యూ.జీ.డి.పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే పరమేశ్వర కాలనీ నందు 250/200 ఏం.ఏం.డయా యూ.జీ.డి.పనులకు,సత్య నగర్ కాలనీ నందు 200 ఏం.ఏం.డయా యూ.జీ.డి.పనులకు ,వసంత్ నగర్ కాలనీ నందు 300,200 ఏం.ఏం.డయా ఎస్.డబ్ల్యూ.జీ.పనులకు ,కాస్ బాగ్ కాలనీ నందు 300 ఏం.ఏం.డయా ఎస్.డబ్ల్యూ.జీ.పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ..నియోజకవర్గ అబివృద్దే తన లక్ష్యం అని తెలిపారు.నియోజకవర్గ పరిధిలోని ప్రధాన సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం చేయడం జరుగుతుందని అన్నారు. 9 కోట్ల రూపాయలతో ఇట్టి నియోజకవర్గన్నీ అభివృద్ధి చేసి ఒక రోల్ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయడం జరుగుతుందని అన్నారు. ఎల్.బి.నగర్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రో రైలు పొడిగించడం జరిగిందని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి,మాజీ కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డి,డివిజన్ అధ్యక్షులు చెన్నగొని శ్రీధర్ గౌడ్,ఎల్.బి.నగర్ వాటర్ వర్క్స్ 10ఏ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి,నాయకులు భాస్కర్ సాగర్,గుడాల మల్లేష్ ముదిరాజ్,మల్లీశ్వరి రెడ్డి,రాకేశ్,గుత్తా లక్మన్ రెడ్డి,గుజ్జ జగన్ మోహన్,దీపావళి శ్రీకాంత్,స్కైలాబ్,ఇంద్రకరణ్ రెడ్డి, డివిజన్ పరిధిలోని పార్టీ సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, పలు విభాగాల కమిటీ సభ్యులు, మహిళలు,కార్యకర్తలు,పార్టీ అభిమానులు,వివిధ కాలనీ అధ్యక్ష,కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.