హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 18 : ఆటోమోటివ్ మాన్యుఫాక్చరర్స్ ప్రైవేట్ లిమిటెడ్(ఏఎంపీఎల్) తన అత్యాధునిక సర్వీసు కేంద్రాన్ని మంచిర్యాలలో బుధవారం ప్రారంభించినట్లు ఆటోమోటివ్ మాన్యుఫ్యాక్చరర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ సంఘ్వి హైదరాబాద్ లో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ అశోక్ లేలాండ్ వాహనాలకు ఉన్న అతిపెద్ద డీలర్లలో ఒకటైన ఆటోమోటివ్ వందకు పైగా సర్వీసు స్టేషన్ల విస్తృతమైన నెట్‌వర్క్ అందిస్తుందన్నారు. ఈ టచ్ పాయింట్లు ఉత్తర్‌ప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో విస్తరించాయన్నారు. ఈ సర్వీసు కేంద్రంలో అత్యాధునిక సదుపాయాలతో ఆరు సర్వీస్ బేలు ఉన్నాయని తెలిపారు. ఆధునిక పరికరాల నిర్వహణకు శిక్షణ పొందిన మెకానిక్‌ల బృందం ఉన్నాయని చెప్పారు. ఈ ప్రాంతంలో టిప్పర్లు, హాలేజ్ వాహనాలు, టూరిస్టు బస్సులు, ఐసీవీ గూడ్స్ వెహికిల్స్ అన్నింటికీ రహదారిపై ఉండే సమయాన్ని పెంచడానికి, తమ విలువైన కస్టమర్ల ఉత్పాదకత, లాభదాయకతను పెంచడానికి ఉపయోగ పడుతుందన్నారు.