ఇప్పటికే తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లో భారత్ జోడో యాత్ర పూర్తిచేసిన రాహుల్ గాంధీ తెలంగాణలో అన్ని వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకుంటూ..ప్రజలతో మమేకమవుతూ రాహుల్ గాంధీ ముందుకుసాగుతున్నారు. తన పాదయాత్ర మార్గంతో పాటు..పాదయాత్ర ముగిసన తర్వాత ప్రజలతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకుని.. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక పలు సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. రైతులు, విద్యార్థులు, గిరిజనులు, చేనేత సమస్యలను రాహుల్ గాంధీ తెలుసుకుంటున్నారు.
భారతీయ జనతా పార్టీ ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతోందని, తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజల సొమ్మును దోచుకుంటోందని విమర్శలు గుప్పిస్తున్నారు. నేడు సాయంత్రం షాద్ నగర్ సోలిపూర్ జంక్షన్ కు చెరుకోనుంది రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర.. అక్కడే కార్నర్ మీటింగ్ లో ప్రసంగించనున్నారు రాహుల్ గాంధీ…బాలానగర్ మండలంలోని పెద్దాయిపల్లిలో భోజన విరామం కోసం ఆగనున్నారు . ప్రజాస్వామ్యం,అణగారిన వర్గాల స్థితి గతులపై రామ మేల్కొటే, సుమన మార్టిన్ వంటి ప్రొఫెసర్ ల తో భేటీ కానున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధి తన పాదయాత్రలో భాగంగా మేధావులు, విశ్లేషకులతో ముచ్చటించనున్నారు.