ఒక్కసారి అవకాశం ఇవ్వండి… తాండూరును అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతా

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 8: ఒక్కసారి అవకాశం ఇస్తే తాండూరును రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చి దిద్దుతానని తాండూరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి  బుయ్యాని మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా తాండూరు పట్టణంలోని మల్రెడ్డిపల్లి రామ్ మందిర్, గుండు పీర్ల వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేశారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. మల్రెడ్డిపల్లి, రామ్ మందిర్, పాండురంగ దేవాలయం, శివాజీ చౌక్, వి వి హెచ్ ఎస్, గాంధీ చౌక్, పాత కూరగాయల మార్కెట్ వినాయక చౌక్ వరకు ప్రజలను కలుస్తూ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ స్కీములపై ఓటర్లకు వివరించారు. అనంతరం మనోహర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఒక్కసారి నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని, అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే మాదిరిగా ఉందని ఎద్దేవా చేశారు. గత ఐదేళ్లుగా తాండూరు అభివృద్ధి  కేవలం కాగితాలకే పరిమితమైందన్నారు. తాండూరు అభివృద్ధి చేస్తానంటూ ఎన్నికల ముందు తాండూరు ప్రజలను మరోసారి మోసం చేసేందుకు  వార్డుకో కోటి రూపాయలు కేటాయించి ప్రతి వార్డులో శంకుస్థాపనలకే పరిమితం అయ్యాయని అన్నారు ఇలాంటి అభివృద్ధి జరగలేదని కేవలం మాటలే తప్ప చేతల్లో ఎక్కడ కనిపించడం లేదని విమర్శించారు. తాండూర్ లో అధికారాన్ని అడ్డం పెట్టుకొని బిఆర్ఎస్ నాయకులు కబ్జాలపై చూపిన శ్రద్ధ, అభివృద్ధిపై చూపలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని ప్రజలు మార్పు కోరుకుంటున్నార ని రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పి ఇంటికి పంపడం ఖాయమని అన్నారు. రాబోయేది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే నా ని అన్నారు. ఈ ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, డిసిసిబి మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, రాకేష్ మహారాజ్, కల్వ సుజాత, ప్రభాకర్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సునీత సంపత్, నాయకులు అబ్దుల్ రావుప్ గాజుల మాధవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page