కంప్యూటర్లు, ట్యాబ్‌ల దిగుమతిపై ఊరట

న్యూ దిల్లీ,ప్రజాతంత్ర,ఆగస్ట్ 5: ‌ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్‌ ‌పీసీలు, పర్సనల్‌ ‌కంప్యూటర్ల దిగుమతులపై ఆంక్షలను ఆకోట్బర్‌ ‌నెలాఖరు వరకు సడలించారు. ఈ ఏడాది అక్టోబర్‌ 31 ‌వరకు వీటి దిగుమతులపై నిషేధం ఎత్తేశారు.  గురువారం నాడు హఠాత్తుగా, తక్షణం అమల్లోకి వచ్చేలా బ్యాన్‌ ‌విధించి భయపెట్టిన కేంద్ర ప్రభుత్వం, తక్షణమే కొంత రిలీఫ్‌ ‌ప్రకటించింది. కోడ్‌ 8471
‌కిందకు వచ్చే ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్‌ ‌పీసీలు, పర్సనల్‌ ‌కంప్యూటర్ల ఇంపోర్టస్‌పై విధించిన నిషేధాన్ని మరో 3 నెలల పాటు పక్కనపెట్టింది. ఈ ఏడాది నవంబర్‌ 1‌వ తేదీ నుంచి బ్యాన్‌ అమలవుతుందని ప్రకటించింది. దీంతో యథావిధిగా దిగుమతులకు అవకాశం ఏర్పడింది. హార్మోనైజ్డ్ ‌సిస్టమ్‌ ఆఫ్‌ ‌నమెన్‌క్లేచర్‌’ ‌కోడ్‌ అం‌టే, పన్ను ప్రయోజనాల కోసం ప్రొడక్టస్‌ను గుర్తించడానికి ఉపయోగించే వర్గీకరణ వ్యవస్థ.

డేటా ప్రాసెసింగ్‌ ‌మెషీన్లు కోడ్‌ 8471 ‌కిందకు వస్తాయి. డేటా ప్రాసెసింగ్‌ ‌పనులను నిర్వహించేందుకు రూపొందించిన డివైజ్‌లను గుర్తించడానికి ఈ కోడ్‌ను ఉపయోగిస్తారు. ఈ కోడ్‌ ‌కిందకు వచ్చే డివైజ్‌ల ద ఇ్మడియట్‌ ఎఫెక్ట్‌తో విధించిన బ్యాన్‌ ‌కారణంగా అతి పెద్ద హార్డ్‌వేర్‌ ‌కంపెనీల సప్లై చైన్స్‌లో గందరగోళం ఏర్పడింది. వాటి కన్‌సైన్‌మెంట్స్ ‌కస్టమ్స్ ‌దగ్గర నిలిచిపోయాయి. ఆ కంపెనీల ఆఫీసుల నుంచి డైరెక్టరేట్‌ ‌జనరల్‌ ఆఫ్‌ ‌ఫారిన్‌ ‌ట్రేడ్‌ ఆఫీసుకు రోజంతా ఫోన్ల ద ఫోన్లు, మెసేజ్‌లు వచ్చాయి. విదేశాలకు తాము ఆర్డర్‌ ‌పెట్టిన ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్‌ ‌పీసీలు, పర్సనల్‌ ‌కంప్యూటర్లు డెలివెరీ దశలో ఉన్నాయని, హఠాత్తుగా బ్యాన్‌ ‌విధిస్తే ఆ కన్‌సైన్‌మెంట్స్ ఏం ‌కావాలంటూ బాడా కంపెనీలు ప్రశ్నల వర్షం కురిపించాయి.

తమ ఆర్డర్ల ప్రకారం ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్‌ ‌పీసీలు, పర్సనల్‌ ‌కంప్యూటర్లను ఫారిన్‌ ‌ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి చేస్తున్నారని, వాటి సంగతేంటని కూడా అడిగాయి. అందులోనూ, దేశంలో పండుగల సీజన్‌కు ముందు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే తాము బిజినెస్‌ ఎలా చేస్తామని అడిగాయి. ఇప్పటికే పెట్టిన ఆర్డర్లు, డెలివెరీ దశలో ఉన్న వస్తువులను తాము తీసుకునే వరకు వెసులుబాటు ఇవ్వాలని అడిగాయి. దీంతోపాటు, ఆయా డివైజ్‌లను దిగుమతి చేసుకోవడానికి ’చెల్లుబాటు అయ్యే లైసెన్స్’ ‌పొందడానికి మరో మూడు నెలల టైమ్‌ ఇవ్వాలని రిక్వెస్ట్ ‌చేశాయి.  దిగుమతులపై అనిశ్చితి కారణంగా యాపిల్‌, ‌శాంసంగ్‌ ‌వంటి కంపెనీలు వాటి ప్రొడక్టస్ ‌పంపడాన్ని తక్షణం ఆపేస్తాయి.

ఈ క్రమంలో హార్డ్‌వేర్‌ ఇం‌డస్టీక్రి మూడు నెలల ఉపశమనాన్ని ప్రకటించింది. నోటిఫికేషన్‌ ‌ప్రకారం… నవంబర్‌ 1 ‌నుంచి ల్యాప్‌టాప్‌లు, పర్సనల్‌ ‌కంప్యూటర్లు, టాబ్లెట్స్ ‌దిగుమతులు ’ఆంక్షలు’ కొనసాగుతాయి. అయితే  కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజకీయంగానూ దుమారం రేపింది. ఇది ’లైసెన్స్ ‌రాజ్‌’ అం‌టూ విమర్శలు వినిపించాయి. తన నిర్ణయాన్ని సెంట్రల్‌ ‌గవర్నమెంట్‌ ‌సమర్థించుకుంది. ’దేశంలో ట్రస్టెడ్‌ ‌హార్డ్‌వేర్‌, ‌సిస్టమ్స్ అం‌దుబాటులో ఉండేలా చూడడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, ఆ ప్రొడక్టస్ ‌దేశీయ తయారీని పెంచడం ప్రభుత్వ లక్ష్యం’ అని ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ ‌చంద్రశేఖర్‌ ‌ట్వీట్‌ ‌చేశారు. దేశంలో సైబర్‌ ‌సెక్యూరిటీ వ్యవస్థను బలోపేతం చేయడానికే లైసెన్సింగ్‌ ‌విధానాన్ని తప్పనిసరి చేస్తున్నట్లు ప్రభుత్వంలోని కొందరు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page