హైదరాబాద్, సెప్టెంబర్ 27: కర్ణాటకలో కాంగ్రేస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు కేటీఆర్,హరీష్, ఎమ్మెల్సీ కవితలకు ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తామని అన్నారు. ఇందిరా భవన్ లో వార్ రూమ్, కనెక్ట్ సెంటర్ ను ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రారంభించారు. అనంతరం భట్టి మాట్లాడుతూ.. సోనియాగాంధీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఇచ్చారని తెలిపారు. ప్రతి మహిళకు నెలకు 2500 వచ్చేలా చేస్తుంది కాంగ్రెస్ అన్నారు. 500 కె గ్యాస్ ఇస్తామన్నారు. రైతుకి క్వింటాలుకి 500 బోనస్ ఇస్తోంది పార్టీ అని తెలిపారు. పేదలకు ఇంటి స్థలం.. ఇల్లు నిర్మాణంకి ఐదు లక్షలు ఇస్తామన్నారు.
ఐదు లక్షల గ్యారంటీ విద్యార్థులకు ఇస్తున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. ప్రతి ఇంటికి గ్యారంటీ కార్డు ఇస్తామన్నారని తెలిపారు. ఈ కార్డులో ఇల్లు.. ఇంటి స్థలం ఉందన్నారు. కర్ణాటకలో కాంగ్రేస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కేటీఆర్..హరీష్..కవితలకు ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తామని, కర్ణాటకలో అమలు అవుతుందా.. లేదా చూద్దాం రండి అని తెలిపారు. బస్సులో వెళదాం అంటే బస్సు కూడా బుక్ చేస్తామన్నారు. కేసీఆర్ లెక్క తప్పుడు ప్రకటన చేవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ అంచనా వేసిన తర్వాతే.. హామీలు ఇస్తున్నామని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ లౌకిక వాదీ అని తెలిపారు. దేశం ఏకం చేయాలని పాదయాత్ర చేశాడని అన్నారు. %వీ×వీ% అసద్ సెక్యులర్ నాయకుడు అయితే రాహుల్ కి సపోర్ట్ చెయ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ ని వ్యతిరేకంగా మాట్లాడటం అంటే.. %ఎఱఎ% బీజేపీకి సపోర్ట్ చేయడమే అన్నారు.