కశ్మీర్‌ ‌ఫైల్స్ ‘‌చునావి జుమ్లా..’

విభజన హావి•ల అమలులోనూ తీవ్ర నిర్లక్ష్యం
టిఆర్‌ఎస్‌ ‌విస్తృతస్థాయి సమావేశంలో సిఎం కెసిఆర్‌

మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని కేసీఆర్‌ ‌మండిపడ్డారు.తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ ‌పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పలు కీలక విషయాలపై కేసీఆర్‌ ‌నేతలకు దిశానిర్దేశం చేశారు. విభజన చట్టం హావి•లను అమలు చేయడంలో మోదీ సర్కార్‌ ‌విఫలమైందని మండిపడ్డారు. రైతు వేసే ప్రతి గింజకు కేంద్రం గిట్టుబాటు ధర కల్పించాలని కేసీఆర్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. కేంద్రం ఏ వర్గాన్ని సంతృప్తి పరచటం లేదని కేసీఆర్‌ ‌ధ్వజమెత్తారు. 24, 25 తేదీల్లో రైతులకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలన్నారు. 28వ తేదీన యాదాద్రికి పార్టీ శ్రేణులంతా తరలిరావాలని సూచించారు. ఉద్యోగాల భర్తీ పక్రియకు సంబంధించి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా సబ్‌ ‌కమిటీ చర్యలు తీసుకోవాలని కేసీఆర్‌ ‌సూచించారు.

 ఇటీవల విడుదలైన కశ్మీర్‌ ‌ఫైల్స్ ‌సినిమాపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి కావాల్సింది కశ్మీర్‌ ‌ఫైల్స్ ‌కాదు.. డెవలప్‌మెంట్‌ ‌ఫైల్స్ ‌కావాలన్నారు. దేశంలో సమస్యలను పక్కదారి పట్టించడానికే ఈ సినిమాను విడుదల చేశారని మండిపడ్డారు. కేంద్రం కశ్మీర్‌ ‌ఫైల్స్ ‌సినిమాను వదిలిపెట్టి, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో చొరవ చూపాలన్నారు. కశ్మీర్‌లో హిందూ పండిట్‌లను చంపినప్పుడు బీజేపీ అధికారంలో లేదా అని కేసీఆర్‌ ‌ప్రశ్నించారు. రైతుల సమస్యలను పక్కదోవ పట్టించడానికే కశ్మీర్‌ ‌ఫైల్‌ ‌సినిమాను ముందుకు తెచ్చారని ధ్వజమెత్తారు. కేంద్రం అసలు విషయాలను పక్కనపెట్టి ఈ సినిమాను ముందుకు తెచ్చి ప్రజల దృష్టిని మళ్లించే దుర్మార్గం జరుగుతుందని కేసీఆర్‌ ‌మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌, ‌రైతు బంధు సమితుల జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వర్‌రావు కూడా హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page