కాంగ్రెసోళ్లు పచ్చి అబద్ధాలు చెప్పేటోల్లు..

  • ప్రజలను అరిగోస పెట్టి కరువుల పాలు .. కష్టాలపాలు చేసింది వారే
  • ధరణిని కాంగ్రెస్‌ ‌పార్టీ తీసేస్తా అంటున్నది.. తీసేస్తే మళ్లా దలారుల రాజ్యమే..
  • సునీత లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి
  • నర్సాపూర్‌ ‌ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ 

నర్సాపూర్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 16: ఎన్నికలు రాగేనే ఆగమాగం కాకుండా మంచీ చెడ్డా ఆలోచించి వోటు వెయ్యాలని.. ఈ ఎన్నికల్లో నర్సాపూర్‌ ‌నుంచి సునీతా లక్ష్మారెడ్డి ఉన్నరు. ఇతర పార్టీలనుంచీ ఉంటరు. వారి మంచి చెడ్డలతో పాటుగా వారి పార్టీల గత చరిత్రను తెలుసుకోవాలని సీఎం కేసీఆర్‌ ‌పేర్కొన్నారు. గురువారం జరిగిన నర్సాపూర్‌ ‌ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ ‌మాట్లాడుతూ… బీఆర్‌ఎస్‌ ‌పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం.. తెలంగాణ ప్రజల హక్కుల కోసం. 58 ఏండ్ల పాటు తెలంగాణ ప్రజలను అరిగోస పెట్టి, కరువుల పాలు చేసి కష్టాలపాలు చేసిన పార్టీ కాంగ్రెస్‌ ‌పార్టీ. 1969 లో మా తెలంగాణ మాగ్గావాలె అని కొట్లాడితే కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రభుత్వం 400 మంది తెలంగాణ బిడ్డల్ని కాల్చి చంపేసారు. లక్షలాది మందిని జైళ్లలో వేసారు. 2004 లో తెలంగాణ ఇస్తామని చెప్పి ఎన్నికల్లో మనతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వొచ్చి మళ్లీ మోసం చేసారు. 2005లనో, 2006 లనో తెలంగాణ ఇవ్వాల్సిన కాంగ్రెస్‌ ‌పార్టీ దోఖా చేసింది. మనందరం ఏకమై పోరాటం చేసి, కేసీఆర్‌ ‌సచ్చుడో..తెలంగాణ తెచ్చుడో అంటే దిగొచ్చిండ్రు. అప్పుడూ సక్కగ ఇవ్వలేదు. ఉద్యోగులు సకలజనుల సమ్మె, అనేక మంది పిల్లలు చనిపోతే, 33 పార్టీలు మద్ధతిచ్చిన తర్వాత ముందుకొచ్చారు.

తెలంగాణల బీఆర్‌ఎస్‌ ‌పార్టీ అధికారంలోకి వొచ్చినప్పుడు సరిగ్గా కరెంటు లేదు..మంచినీళ్లు లేవు.. రైతులు, చేనేత కార్మికుల ఆకలి చావులు, ఆత్మహత్యలు..వలసలు పోవుడు. సంక్షేమ కార్యక్రమాల్లో పెన్షన్లను తీసుకున్నాం. సమాజంలో కొందరు విధివంచితులైతే వారిని ఆదుకోవాల్సిన బాద్యత సమాజానిది, ప్రభుత్వానిది. పెన్షన్‌ ‌దారులు ఎవరిపై ఆధారపడి ఉండకుండా చూడాలని వందలల్ల ఉన్న పెన్షన్‌ ‌ను వేలల్లో తీసుకుపోయిందే బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం. పెన్షన్లను ఐదు వేలకు పెంచుకుంటం. నీటి తీరువా బకాయీలను మాఫీ చేసి, దానిని పూర్తిగా రద్దు చేసినం. రైతులకు సాయం చేయాలని ఏ ప్రభుత్వం, ఏ నాయకుడూ ఆలోచన చేయలేదు. దేశంలో రైతు బంధును పుట్టించిందే కేసీఆర్‌.. ‌బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం. ఏడాదిన్నరలోనే దేశంలో ఎవ్వరూ ఇవ్వని విధంగా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ ‌ను అదిస్తున్నాం. రైతులకు పెట్టుబడి సాయంగా ‘రైతు బంధు’ను అందిస్తున్నాం. అంజుమన్‌ అప్పులు కట్టకుంటే రైతుల తలుపులు పీక్కొనిపోయిండ్రు తప్ప కాంగ్రెస్‌ ఏనాడూ రైతులకు సాయం చేయలేదు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటున్నది. దురదృష్టవశాత్తూ రైతు చనిపోతే, వారి కుటుంబం రోడ్డున పడొద్దని రూ.5 లక్షల రైతు బీమా అందిస్తున్నది.

రైతు బంధు ఉండాలంటే.. అది రూ.16 వేలకు పోవాలంటే నర్సాపూర్‌ ‌లో సునీత లక్ష్మారెడ్డి, బీఆర్‌ఎస్‌ ‌గెలువాలి. రాష్ట్రంలో ఏ సభలో అడిగినా ప్రజలందరూ 24 గంటల కరెంటు కావాలని అంటున్నరు. కాంగ్రెస్‌ ‌నాయకులు 24 గంటల కరెంటు వద్దంటున్నరు. 3 గంటలు సాలంటున్నరు. పిసిసి మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి.. కేసీఆర్‌ ‌కు ఏంపనిలేదు..రైతు బంధు’ దుబారాగా ఇస్తున్నడంటడు. కాంగ్రెస్‌ ‌జాతీయ నాయకుడు రాహూల్‌ ‌గాంధీ ధరణి’ని తీసి బంగాళాఖాతంలో వేయాలని అంటడు. ధరణి పోర్టల్‌’‌తో ప్రభుత్వం తనకున్న అధికారాన్ని ప్రజల బొటనవ్రేలుకు ఇచ్చింది. ధరణి తీసేస్తే రైతు బంధు, రైతు బీమా, పంట కొనుగోలు డబ్బులు ఎలా వస్తయ్‌? ‌ధరణి తీసేస్తే మళ్లీ వీఆర్వోలు, పహాణీ నకళ్లు, ఎమ్మార్వో ఆఫీసుల చుట్టూ తిరగాల్నా? ధరణి తీసేస్తే మళ్లా దళారుల రాజ్యం, భూకబ్జాలు, పైరవీకారులు, పాత రిజిస్ట్రేషన్‌ ‌పద్ధతి, పడిగాపులు పడి ఉండాలె. కాంగ్రెస్‌ ‌పార్టీ బహిరంగంగానే తీసేస్తా అంటున్నది.

కర్ణాటక నుంచి వచ్చిన కాంగ్రెస్‌ ‌నాయకుడు మేం 5 గంటల కరెంట్‌ ఇస్తున్నామన్నడు.మరి మన తెలంగాణలో 24 గంటల కరెంటు ఇస్తున్నం. కాంగ్రెసోల్లు పచ్చి అబద్ధాలు చెప్పేటోల్లు. అసైన్డ్ ‌భూములందరికి కూడా పట్టాలు చేసి వారికే ఇస్తామని చెబుతున్నా. కాంగ్రెస్‌ ‌పార్టీ పూర్తిగా అబద్ధాలు చెబుతున్నాయి. కాంగ్రెస్‌ ‌రాజ్యంలో మంజీరా, హల్దీ నదులు ఎలా ఉండె. వాటి మీద చెక్‌ ‌డ్యాంలు కట్టకూడదని బ్యానర్లు పెట్టిండ్రు. ఈరోజు చెక్‌ ‌డ్యాంలు కట్టి నీళ్లందిస్తే మత్తెడులు పోస్తున్నయ్‌. 24 ‌గంటల కరెంటుతో రైతులు దర్జాగా కాలుమీద కాలేసుకొని ఉంటున్నరు. నాడు మంచినీళ్లకు ఎన్నో బాధలు ఉండేవి. నేడు అవన్నీ లేకుండా చేసినం. పిల్లుట్ల కాలువ కూడా పూర్తవుతుంది. నర్సాపూర్‌ ‌బంగారు తున్కగా అవుతుంది. దల్తాబాద్‌, ‌కాసాల మున్సిపాలిటీలను, రంగంపేట మండలాన్ని ఏర్పాటు చేసే బాధ్యత నాది. తప్పకుండా చేస్తాం. కౌడుపల్లిలో డిగ్రీ కాలేజీ కి కూడా డిగ్రీ కాలేజీ వచ్చింది. మదన్‌ ‌రెడ్డిని సముచితంగా గౌరవించుకుంటం. కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్‌ ‌లాంటివి ప్రజల బాధలను తగ్గించాలని చేసినం. మైనార్టీలకు గత ప్రభుత్వాల కంటే బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేశాం. సునీతా లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని సీఎం కేసీఆర్‌ ‌కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page