కాంగ్రెస్‌ ‌తెలంగాణ ఇచ్చిందన్నది శుద్ద అబద్ధ0

  • వేయిమంది బలిదానాలకు కాంగ్రెస్‌దే బాధ్యత
  • నేను చెప్పేది తప్పయితే ఓడించి చూడండితెలంగాణలో సంక్షేమమే తప్ప.. సంక్షోభం లేదు
  • 9 ఏండ్లుగా అభివృద్ధికి నిర్మాణాత్మకంగా పని
  • మౌలిక వసతులకు భారీగా కేటాయింపులు
  • కంటెంట్‌ ‌లేని కాంగ్రెస్‌..‌కమిట్‌మెంట్‌ ఉన్న కెసిఆర్‌‌

పల్లె, పట్టణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చలో కెటిఆర్‌ ‌సవాల్‌
హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్ 5: ‌కాంగ్రెస్‌ ‌పార్టీ విశ్వసనీయత 2004లోనే పోయిందనీ .. రాష్ట్రం ఇస్తామని చెప్పి మోసం చేశారు కనుక ఆరోజే వీళ్ల అడ్రస్‌ ‌గల్లంతయింది..అందుకే ప్రజలు వీళ్లను తోమి తోమి పక్కన కూర్చోబెట్టారు. ఎందుకంటే ఎన్నో వందల ప్రాణాలు పోయాయి అందుకు ఆ పార్టీనే కారణమని ఆరోపించారు. వీళ్లు మరోసారి ప్రజల విశ్వసనీయత పొందే అవకాశమే లేదంటూ కాంగ్రెస్‌ ‌నేతలపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌  ‌వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులకు వివరణ ఇస్తూ  తెలంగాణలో సంక్షేమమే తప్ప.. సంక్షోభం లేదని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. 9 ఏండ్లుగా తెలంగాణ అభివృద్ధికి నిర్మాణాత్మకంగా పని చేస్తున్నామని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. ఒక వైపు సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ మరో వైపు మౌలిక వసతులకు భారీగా కేటాయింపులు చేస్తున్నామని అన్నారు. బడ్జెట్‌ ‌పెట్టుబడి వ్యయంలో తెలంగాణె ముందుందన్నారు. బడ్జెట్‌  ‌పెట్టుబడి వ్యయం ఛత్తీస్‌గఢ్‌లో 15 శాతం, రాజస్థాన్‌లో 16 శాతం మాత్రమే ఉంది. తెలంగాణలో మాత్రం 26 శాతం పెట్టుబడి వ్యయంగా పెడుతున్నాం.

నేను చెప్పేది తప్పుంటే వచ్చే ఎన్నికల్లో ఓడించండి అని కేటీఆర్‌ ‌సవాల్‌ ‌చేశారు.తెలంగాణ నమూనా.. అంటే సమగ్ర, సమ్మిళిత అభివృద్ధి. మౌలిక వసతుల కల్పనలో గ్రామాలు, పట్టణాలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నాం. వ్యవసాయం, పారిశ్రామిక రంగం, సేవారంగం దూసుకుపోతున్నాయి. తెలంగాణలో సంక్షేమమే తప్ప.. సంక్షోభం లేదు అని కేటీఆర్‌ ‌తేల్చిచెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో తెలంగాణలో ప్లలె మురిసింది.. పట్టణం మెరిసింది. పల్లెల్లో హార్వస్టర్లు, పట్టణంలో ఇన్వెస్టర్లు పరుగులు పెడుతున్నారు. శాసనసభలో పల్లె, పట్టణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సభ్యులు మాట్లాడిన అనంతరం కేటీఆర్‌ ‌వివరణ ఇచ్చారు. ఇదే సందర్భంలో కాంగ్రెస్‌ ‌నేతలపై రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ‌తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కంటెంట్‌ ‌లేని కాంగ్రెస్‌కు, కమిట్‌మెంట్‌ ఉన్న కేసీఆర్‌కు పోలికా? అని కేటీఆర్‌ ‌ప్రశ్నించారు. 1956లో తెలంగాణకు, ఆంధ్రాకు ఇష్టం లేని బలవంతపు పెళ్లి చేసిన పాపాత్ములు ఎవరన్నారు.

1968లో 370 మంది పిల్లలను కాల్చి చంపిందేవరు? 1971లో 11 మంది పార్లమెంట్‌ ‌సభ్యులను ప్రజలు గెలిపించినా వారి ఆశయాలను తుంగలో తొక్కి, కాంగ్రెస్‌లో కలుపుకున్నది వాస్తవం కాదా..? 2004లో మాటిచ్చి 2014 దాకా 1000 మందిని చంపింది వారు కాదా..? ఇవాళ మళ్లీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నది ఎవరు? అని కేటీఆర్‌ ‌మండిపడ్డారు. తెలంగాణ సాధనలో కాంగ్రెస్‌, ‌టీఆర్‌ఎస్‌ ‌పాత్రకు తేడా ఏందంటే.. బ్రిటిషోళ్ల ద భారతీయులు కొట్లాడి స్వాతంత్య్ర తెచ్చుకున్నారు. బ్రిటిషోళ్లు మేం స్వాతంత్య్ర ఇచ్చినం అంటే ఏమన్నా సిగ్గు ఉంటదా? చెప్పేందుకే ఎంత గలీజ్‌గా ఉంటది. అదొక్కటే కాదు.. నవమాసాలు మోసి ప్రసవించిన తల్లికి ఎంత బాధ ఉంటదో.. మాకు అంతే బాధ ఉంటది. మంత్రసాని పాత్ర పోషించిన వారే కాంగ్రెసోళ్లు. 1000 మందిని పొట్టన పెట్టుకున్న బలిదేవత సోనియా అని రేవంత్‌ ‌రెడ్డి అన్నారన్న విషయాన్ని కేటీఆర్‌ ‌గుర్తు చేశారు. రాష్ట్ర బ్జడెట్‌ అం‌టే విపక్షాలకు జమ ఖర్చుల లెక్క మాత్రమే అని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌కు బడ్జెట్‌ అం‌టే రాష్ట్ర ప్రజల జీవనరేఖ అన్నారు.   9 ఏండ్ల క్రితం రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ పరిస్థితి దారుణంగా ఉండేదని, కాంగ్రెస్‌ ‌పాలన ఎంత చెత్తగా ఉండేదో ఆనాడే సభలో రేవంత్‌ ‌రెడ్డి చెప్పిండని కేటీఆర్‌ ‌గుర్తు చేశారు. నీళ్ల కోసం రోజుకొక ట్యాంకర్‌ ‌తెచ్చుకుంటున్నామన్న భట్టి విక్రమార్క వ్యాఖ్యలు అవాస్తవం అని కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు.

2022 జనవరి నుంచి భట్టి ఒక్క ట్యాంకర్‌ ‌కూడా బుక్‌ ‌చేయలేదు. భట్టి ఉంటున్న ఇంట్లో మంచినీటి టర్‌ ‌చెడిపోయింది. టర్‌ ‌చెడిపోవడం వల్లే రూ. 2.90 లక్షల నీటి బిల్లు చెల్లించాల్సి వచ్చింది. టర్‌ ‌పని చేసి ఉంటే.. భట్టి ఇంటికి కూడా ఉచిత మంచినీటి పథకం వర్తించేది. నగరంలో ప్రతి ఒక్కరికి 20 వేల లీటర్ల వరకు మంచినీరు ఉచితంగా ఇస్తున్నాం అని తెలిపారు. కాంగ్రెస్‌ ‌పార్టీలో పోటీని చూస్తే తనకు పాకిస్తాన్‌ ‌క్రికెట్‌ ‌టీమ్‌ ‌గుర్తొస్తుందని కేటీఆర్‌ ‌సెటైర్లు వేశారు. క్రికెట్‌ ‌టీమ్‌ ‌లో 11 మంది ఆడతారు, అయితే వెనుకటికి పాకిస్తాన్‌ ‌టీమ్‌ ఉం‌డేది. అందులో కెప్టెన్‌ ఒకరు ఉంటారు, మిగతా వాళ్లంతా మాజీ కెప్టెన్లు అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ ‌పార్టీలో ఉండేది నలుగురు ఎమ్మెల్యేలు ఉంటారు. వీళ్లు నలుగురు కలిసి ఒకేచోట కూర్చుని పనిచేయలేరు. కానీ వీళ్లు నాలుగు కోట్ల మందిని పాలిస్తామని గొప్పలు చెబుతారని మంత్రి కేటీఆర్‌ ‌వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ ‌నేతలు మొత్తం 10 మంది సీఎం అభ్యర్థులం అంటూ ఒకరిపై ఒకరు నెగ్గే ప్రయత్నం చేస్తుంటారని..

ఈ క్రమంలో తమ పరపతి పెంచుకునేందుకు బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు, విమర్శలు చేస్తుంటారని ఏకిపారేశారు. వాళ్లంతా కలిసికట్టుగా ఉండి ప్రజల కోసం ఆలోచించడం మొదలుపెట్టాలని, బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని, అభివృద్ధిని గుర్తించాలని సూచించారు. కాంగ్రెస్‌ ‌పార్టీ ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయిందని, కాలం చెల్లిన  మెడిసిన్‌ అని, చచ్చిపోయిన పాములాంటిదని మంత్రి కేటీఆర్‌ ‌విరుచుకు పడ్డారు. కాంగ్రెస్‌ ‌ను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలు కాంగ్రెస్‌ ‌కోరలు తీసేశారని, కానీ వాళ్లు ఏదో ఊహించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పక్కింట్లో పెళ్లిఅయితే ఇంట్లో హడావుడిలాగ.. కర్నాటక కాంగ్రెస్‌ ఎన్నికల ఫలితాలను చూసి తెలంగాణలో ఆ పార్టీ నేతలు హంగామా చేస్తున్నారని చెప్పారు. కర్ణాటకలో ఏదో జరిగిందని చూసి, భట్టి, శ్రీధర్‌ ‌బాబు, మరికొందరు నేతలు తమకు పదవులు అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. సీతక్క సీఎం అని ఒకాయన చెప్పారు. కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి అయితే సీతక్క సీఎం ఏంది, ఇది పెద్ద జోక్‌ అన్నారని గుర్తుచేశారు. మూడు, నాలుగు నెలల్లో అధికారంలోకి వస్తారు కదా, ఆరోజు పదవులు తేల్చుకోవాలన్నారు.

ప్రజలకు మంచినీళ్లు..విపక్షాలకు మూడుచెర్ల నీళ్లు
మూడోసారి ముచ్చగా సిఎం కెసిఆర్‌
‌కేంద్రం అవార్డుల్లో 30శాతం తెలంగాణకే
60 ఏండ్లలో చేయని పనులు 6ఏళ్లలో చేశాం
ప్రగతిని చంద్రబాబు, జగన్‌ ‌కూడా గుర్తించారు
అసెంబ్లీలో మంత్రి కెటిఆర్‌ ‌వెల్లడి

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్ 5: ‌రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ ‌భగీరథ పథకం కింద ప్రజలందరికీ మంచినీళ్లు తాగిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ ‌తెలిపారు. అలాగే ప్రతిపక్షాలకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తాం.. మూడోసారి కేసీఆర్‌ ‌ముఖ్యమంత్రిగా కూర్చుంటారు.. రు అక్కడ ఉంటారో లేదో చూసుకోవాలని ప్రతిపక్షాలను ఉద్దేశించి కేటీఆర్‌ అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. శాసనసభలో పల్లె, పట్టణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా కేటీఆర్‌ ‌సుదీర్ఘంగా మాట్లాడారు. తెలంగాణలో ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు నల్లాల ద్వారా అందుతుందని కేంద్ర మంత్రినే పార్లమెంట్‌లోప్రకటించారని కేటీఆర్‌ ‌గుర్తు చేశారు. కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో 30 శాతం తెలంగాణకే వచ్చాయి. గత 9 ఏండ్లలో బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం రూ. 29 వేల కోట్లకు పైగా ఖర్చు చేసింది. కాంగ్రెస్‌ ‌హయాంలో గ్రామాల్లో పెట్టిన ఖర్చు రూ. 6 వేల కోట్లు మాత్రమే. కాంగ్రెస్‌ ‌హయాంలో మానేరు ఒడ్డున ఉన్నవారికి కూడా మంచినీరు అందేది కాదు. కాంగ్రెస్‌ 60 ఏం‌డ్లలో చేయని పనులను 6 ఏండ్లలోనే చేసి చూపించాం. రాష్ట్రంలో 24 వేల ఆవాసాలకు నల్లా ద్వారా మంచినీరు ఇస్తున్నాం.

రాష్ట్రంలో కొత్తగా లక్షన్నర కిలోటర్ల పైపులైన్లు వేశాం. నీళ్ల కోసం ఆనాడు నీళ్ల మంత్రి జానారెడ్డి దగ్గరకు వెళ్తే.. కన్నీళ్లు పెట్టించారు. నల్లగొండలో ప్లోరెడ్‌ ‌రక్కసిని రూపుమాపాం అని కేటీఆర్‌ ‌తెలిపారు.కాంగ్రెస్‌ ‌డబ్బా ఇండ్లు కట్టించి ఇచ్చింది.. బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం మాత్రం డబుల్‌ ‌బెడ్రూం ఇండ్లు కట్టించి ఇచ్చిందని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.28 లక్షల డబుల్‌ ‌బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టాం. ఒక్క డబుల్‌ ‌బెడ్‌రూం ఇల్లు ఏడు ఇందిరమ్మ ఇండ్లతో సమానం. గృహలక్ష్మి పథకం కింద మరింత మందికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తామని కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ‌పరిపాలనలో మున్సిపాలిటీలకు డబ్బులు రాకపోయేది అని కేటీఆర్‌ ‌గుర్తు చేశారు. ఇవాళ మాత్రం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నాం. పురపాలక శాఖ ఆధ్వర్యంలో 2014 -23 మధ్య ఒక లక్షా 21 వేల 294 కోట్లు ఖర్చు చేశాం. 2004 ? 14 వరకు చూస్తే ఖర్చు చేసింది రూ. 26,211 కోట్లు. అంటే 462 శాతం ఎక్కువ ఖర్చు చేశాం. కేంద్రం ఒక మిథ్య అని ఎన్టీఆన్‌ ఏనాడో చెప్పారు.

రాష్టాల్ర సమాహారమే కేంద్రం. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేసిందే లేదని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి జగన్‌, ‌మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి మంత్రి కేటీఆర్‌ ఈ ‌సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి పక్క రాష్ట్రంలోని చంద్రబాబు, జగన్‌కు అర్థమైంది. కానీ రాష్ట్రంలోని విపక్షాలకు అర్థం కావడం లేదని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. హైదరాబాద్‌ అభివృద్ధిని, భూముల విలువను చంద్రబాబు గుర్తించారు. తెలంగాణలో ఎకరం అమ్మితే ఏపీలో 100 ఎకరాలు కొనొచ్చు అని చంద్రబాబు అన్నారు. తెలంగాణ అభివృద్ధిని ఒప్పుకున్న చంద్రబాబుకు ధన్యవాదాలు. కేసీఆర్‌కు రైతులపై ప్రేమ ఉన్నందునే టర్లకు ఒప్పుకోలేదని చంద్రబాబు అన్నారు. తెలంగాణలో శాంతిభద్రతలను ఏపీ సీఎం జగన్‌ ‌కూడా మెచ్చుకున్నారు. దిశ ఘటన విషయంలో ఐ సెల్యూట్‌ ‌టు కేసీఆర్‌ అని జగన్‌ ‌కూడా అన్నారు. తెలంగాణ శాంతి భద్రతలను మెచ్చుకున్న జగన్‌కు కూడా ధన్యవాదాలు. జగన్‌, ‌చంద్రబాబుకు అర్థమైన విషయాలు విపక్షాలకు అర్థం కావట్లేదు అని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page