వికారాబాద్ జిల్లా ప్రజాతంత్ర నవంబర్ 3: కాంగ్రెస్ పార్టీకి మైనార్టీల పూర్తి మద్దతు ఉందని వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు హాజీ పాషా పేర్కొన్నారు. శుక్రవారం మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేసిన మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీ పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు హాజీపాషా మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ మైనార్టీ సెల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హాజీ పాషా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలోని మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు లభించి విద్యాపరంగా అభివృద్ధి సాధించి చాలామంది మైనార్టీలకు ఉద్యోగాలు వచ్చాయని పేర్కొన్నారు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం కేసీఆర్ తీరని మోసం చేశారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు బిఆర్ఎస్ పార్టీకి మైనార్టీలంతా తగు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ చేసింది ఒకటి చెప్పింది ఒకటి అని మైనార్టీలను మోసం చేసినందుకు ఎన్నికల్లో గుణపాఠం తప్పదు అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మైనార్టీల సపోర్ట్ పూర్తిగా లభిస్తుందని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అధికారం చేపట్టబోతుందని పేర్కొన్నారు వికారాబాద్లో మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నారని రానున్న కాంగ్రెస్ ప్రభుత్వం మాయం లో ముఖ్యమైన మంత్రిగా వికారాబాద్ అభివృద్ధికి బాటలు వేస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎం ఆనంద్ గాండ్ల శివానందం అబ్దుల్ ఖాలిద్ మైనార్టీ సెల్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.