కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి ఉంటుంది

 షాద్ నగర్ ప్రజాతంత్ర నవంబర్ 20 : షాద్ నగర్ నియోజకవర్గం లోని కేశంపేట్ మండలంలోని సంఘం గ్రామంలో ఎన్నికల ప్రచారం.తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే అన్ని వర్గాల ప్రజలకు బంగారు భవిష్యత్తు లభిస్తుందని, షాద్ నగర్ నియోజకవర్గం అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీర్లపల్లి  శంకర్ భారీ మెజార్టీతో గెలిపించాలని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి కోరారు. కేశంపేట మండలం సంఘం గ్రామంలో సోమవారం మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్, జడ్పిటిసి విశాల శ్రవణ్ రెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు బిఆర్ఎస్ పాలనను విసుగు చెందారని, మార్పు కోరుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో రవన్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. అవినీతి పాలన అంతం కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలతో రాష్ట్రంలోని పేద మధ్యతరగతి ప్రజల జీవితాల్లో వెలుగులు నిండుతాయని అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే మహిళల ఖాతాల్లో నెలకు రూ. 2500 చొప్పున వేస్తామని, రూ. 500కే గ్యాస్‌ సిలిండర్‌ అందజేస్తామని అన్నారు. రైతుభరోసా కింద రైతులు, కౌలురైతులకు ఏడాదికి రూ.15 వేలు, ఉపాధి కూలీలకు ఏడాదికి రూ. 12వేలు అందిస్తామని హామీ ఇచ్చారు. పట్టణాలు, పల్లెల్లో పేదల ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తామని, పేదలు ఇళ్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు ఉచితంగా అందిస్తామని, పేద విద్యార్థుల చదువుల కోసం రూ. 5 లక్షల బ్యాంక్‌ గ్యారెంటీ ఇస్తామని, రూ. 4 వేల పింఛన్‌ అందజేస్తామని అన్నారు. టిఆర్ఎస్ నాయకుల మోసపూరిత వాగ్దానాలకు ఓటుతో బుద్ధి చెప్పి ఇంటికి పంపించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు విరేశం కాంగ్రెస్ నాయకులు కాశినాత్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, వినయ్ రెడ్డి, ఇబ్రహీం, ఖాదర్ ఘోరీ, బాలస్వామి, బాలరాజు, భూపాల్ రెడ్డి, గిరి గౌడ్, బుర్ర వెంకటేష్ గౌడ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు  తదితరులు పెద్దఎత్తున హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page