కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనోహర్ రెడ్డికి 5వ వార్డు నుండి భారీ మెజార్టీని అందిస్తాం

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 25: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బుయ్యాని మనోహర్ రెడ్డికి 5వ వార్డు నుండి భారీ మెజార్టీని అందిస్తామని కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు అఖిల్ బాబా పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డిసిసిబి చైర్మన్ బుయ్యాని మనోహర్ రెడ్డి పట్టణ పరిధిలోని 1,2,3,4,5,6వ వార్డులలో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 5వ వార్డులో స్థానికుల ఉద్దేశించి కాంగ్రెస్ అభ్యర్థి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తనను ఆశీర్వదించి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపిస్తే  పట్టణంలోని 36 వార్డులను అభివృద్ధి చేసి తాండూర్ పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని అన్నారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు అఖిల్ బాబా మాట్లాడుతూ 30న జరిగే ఎన్నికల్లో ఐదో వార్డు నుండి కాంగ్రెస్ అభ్యర్థి మనోహర్ రెడ్డికి భారీ మెజార్టీ ఇస్తామని అన్నారు ఎన్నికల్లో మనోహర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని అన్నారు. ఎన్నికల ప్రచారంలో డిసిసిబి మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ భీమ్ సింగ్  మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ నాయకులు సర్దార్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page