కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేఎల్ఆర్ ను గెలిపించాలి

మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 3: జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తే, అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని రంగా రెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు చల్లా నర్సింహ రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ జిల్లెలగూడ స్వాగత్ గ్రాండ్ దగ్గర మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్అర్) కు ఓటు వేయాలని నిర్వహించిన బహిరంగ సభకు చల్లా నర్సింహ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేఎల్ఆర్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే, కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు హామీలను అమలు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ.. కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు కు ఓటు వేసి బారి మేజరిటీ తో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమానికి  కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి, టిపిసిసి కార్యదర్శి వై.అమరేందర్ రెడ్డి, ఏనుగు జంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page