కాంగ్రెస్ పార్టీ ద్వారానే ప్రాజలకు న్యాయం

కుత్బుల్లాపూర్, ప్రజాతంత్ర, నవంబర్ 15 : తెలంగాణ ఇచ్చిన సోనియా రుణం తీర్చుకుందామని, కాంగ్రెస్ పార్టీ ద్వారానే పేదలకు న్యాయం జరుగుతుందని, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కాంగ్రెస్ అభ్యర్థి కొలన్ హనుమంత్ రెడ్డి అన్నారు. బుధవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 డివిజన్ గాజులరామారం దగ్గర ఐవి ఎంక్లేవ్ అపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేసిన సమావేశంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలన్ హనుమంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు  ప్రధానంగా ఎదుర్కొంటున్న నీటి సమస్యను గురించి తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ ఆరు గ్యారంటీలపై ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని ముఖ్యంగా మహిళలు చాలా ఆనందంతో స్వాగతిస్తున్నారన్నారు. యువకులకు రైతులకు అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగే విధంగా ఉన్న ఆరు గ్యారంటీ పథకాలను ప్రతి గడపకు చేరే విధంగా కృషి చేస్తామని అన్నారు. ప్రజలందరి సహకారంతో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేస్తదనీ ధీమా వ్యక్తం చేశారు. అనంతరం అపార్ట్మెంట్ వాసులు తమ పూర్తి మద్దతు తెలిపి హన్మంత్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని తీర్మానం చేసారు. ఈ కార్యక్రమంలో సొంటిరెడ్డి పున్నారెడ్డి, సంజీవ్ రెడ్డి, సాయి రెడ్డి, దీక్షిత, పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page