కాంగ్రెస్‌ ‌పార్టీ శ్రేణులకు సోనియా గాంధీ త్యాగం ఆదర్శం కావాలి ..

గత వారం కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ ‌పార్టీ అయిదు రోజుల సుదీర్ఘ మంతనాలు,చర్చల తరువాత గురువారం సిద్దరామయ్య ను ముఖ్యమంత్రి గా ,,పోటీదారుడు డి కె శివకుమార్‌ ‌ను ఉప ముఖ్యమంత్రి గా ఖరారు చేసింది.ప్రమాణ స్వీకారం శనివారం ..రేపు బెంగళూరు కంఠీరవ స్టేడియం లో జరుగనున్నది. కర్ణాటక లో కాంగ్రెస్‌ ‌పార్టీ విజయానికి ఆ రాష్ట్ర పార్టీ  అధ్యక్షుడు డి కె శివకుమార్‌ ‌నాయకత్వంలో సమిష్టిగా శ్రమించడమే అన్న దానిలో ఎవరికీ సందేహం లేదు. సిద్దరామయ్య మచ్చ లేని సుదీర్ఘ రాజకీయ అనుభవం  కూడా  ప్రశంసించాల్సిందే ..! ఈ ఇద్దరు నాయకుల్లో ఎవరు ముఖ్యమంత్రి అన్న ఉత్కంఠ గత అయిదు రోజులుగా కొనసాగింది.ఒక సమయం లో డి కె శివకుమార్‌ ‌పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్నారు అన్న వార్త కూడా చక్కర్లు కొట్టింది. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి తను రాజీనామా చేసే ప్రసక్తే లేదనీ ..అటువంటి నిరాధార వార్తలను సృష్టిస్తున్న వారి పై పరువు నష్టం దావా వేస్తానని డి కె అన్నారు.

పార్టీ తన కన్నతల్లి లాంటిదనీ ..136 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నానని డి కె అన్నారు.రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడో యాత్ర సందర్బంలో,పార్టీ రాష్ట్రంలో కష్ట కాలం లో ఉన్నప్పుడు అన్నీ తానై అండగా నిలబడ్డ డీకే శివకుమార్‌ ‌కు కాంగ్రెస్‌ ‌పార్టీ అధినేత్రి  శ్రీమతి సోనియా గాంధీ ఆదర్శప్రాయురాలు ..! అక్రమ ఆస్తుల కేసులో డీకే శివకుమార్‌ ‌తీహార్‌ ‌జైల్లో ఉన్నపుడు తనను పరామర్శించడానికి శ్రీమతి సోనియా గాంధీ రావడాన్ని ఆయన ఎన్నికల ప్రచార సందర్బంగా గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీ అధినేత్రి శ్రీమతి సోనియా గాంధీ ఆ పార్టీ శ్రేణులందరికీ ఆదర్శప్రాయులు ..ఆమె 2004,2009 లో రెండు సార్లు దేశ అత్యున్నత ప్రధాన మంత్రి పదవి అవకాశాన్ని  తృణప్రాయంగా త్యజించారు. అంతేకాదు ..1991లో రాజీవ్‌ ‌గాంధీ మరణానంతరం పార్టీ అధ్యక్ష బాధ్యతలను కూడా నిరాకరించారు.గత్యంతరం లేని పరిస్థితుల్లో సోనియా గాంధీ 1998 లో పార్టీ జాతీయ  అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి..అటల్‌ ‌బిహారీ వాజపేయి నాయకత్వం లోని భారతీయ జనతా పార్టీ ని 2004 లో ఓడించడంలో తన వంతు కృషి చేసారు.మతతత్వ వ్యతిరేక పార్టీలను కలుపుకుని .సొంత పార్టీ సభ్యుల ఒత్తిడిని కూడా కాదని.డా.మన్మోహన్‌ ‌సింగ్‌ ‌ను దేశ ప్రధాని గా ప్రతిపాదించారు.

2009 లో కూడా అదే జరిగింది.మతతత్వ భారతీయ జనతా పార్టీ ని ఓడించి ఎన్నికల్లో మళ్ళీ  విజయం సాధించి డా.మన్మోహన్‌ ‌సింగ్‌ ‌ను రెండవ సారి ప్రధాని గా కొనసాగించారు కానీ సోనియా గాంధీ ఆ పదవి ఏనాడూ ఆశించలేదు. కుమారుడు రాహుల్‌ ‌గాంధీ అప్పటికే రెండు సార్లు లోక్‌ ‌సభ సభ్యుడు గా ఎన్నికయినా ..పార్టీలో సభ్యులు ప్రధాని పదవికి  ఆయన పేరు ను ప్రతిపాదించినా సోనియా గాంధీ తిరస్కరించారు.జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ ‌పార్టీ కి నాయకత్వం వహిస్తూ ..పదవుల కోసం వెంపర్లాడని శ్రీమతి సోనియా గాంధీ ఈ రోజు ఆ పార్టీ శ్రేణులందరికీ ఆదర్శం కావాలి. కర్ణాటక లో కాంగ్రెస్‌ ‌పార్టీ విజయం ఖచ్చితంగా ఆ పార్టీ  రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ‌శ్రమ వల్లనే..అందులో ఏమాత్రం సందేహం లేదు..కానీ దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ వాతావరణంలో డీకే శివకుమార్‌ ‌హుందాగా ..పార్టీ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ ఆదర్శంగా.. ముఖ్యమంత్రి ఎంపిక  ను పార్టీ అధిష్టానానికి అప్పగించి ..జాతీయ స్థాయిలో ..2024 సార్వత్రిక ఎన్నికలను దృష్ట్యా పార్టీ   ఎదుగుదలకు కృషి చేయాలి ..డీకే శివకుమార్‌ ‌కు ఆ సత్తా,పార్టీ పట్ల ఆ కమిట్మెంట్‌ ‌కూడా ఉందని ఆశిద్దాం ..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page