ఎన్నికల ప్రచార సభ వికారాబాద్ జిల్లా నుండి నేను నిర్వహించాను..
సీఎం కేసీఆర్ హుస్నాబాద్ నుంచి నీవు ప్రారంభించావు ఇక చూసుకో..
డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ప్రతి ఒక్కరూ తరలిరావాలి..
-ఎన్నికల శంఖారావం పూరించిన టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి.
వికారాబాద్ జిల్లా ప్రజాతంత్ర అక్టోబర్ 16: వికారాబాద్ జిల్లాకు సీఎం కేసీఆర్ తీరని అన్యాయం చేశారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని చిగుళ్లపల్లి గ్రౌండ్లో ఎన్నికల శంఖారావసభను రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా టిపిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు ఇస్తానని సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి పాలన సాగించాలని పేర్కొన్నారు. ముఖ్యంగా పరీక్ష పేపర్ల లీకేజీలతో విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్న దద్దమ్మ ప్రభుత్వం సీఎం కేసీఆర్ ప్రభుత్వం అన్నారు. డీఎస్సీ పరీక్షలు రద్దు కావడంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంటే ఆమెపై అబద్ధపు మాటలు చెబుతూ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హుస్నాబాద్ సభ నుంచి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం ప్రారంభించామని నేను వికారాబాద్ జిల్లా కేంద్రం నుండి ఎన్నికల శంఖారావం సభ ప్రారంభించామని ఇక చూసుకో డిసెంబర్ 9న కాంగ్రెస్ పార్టీ సీఎం ప్రమాణస్వీకారం ఉదయం 10:30 గంటలకు ఎల్బి స్టేడియంలో నిర్వహించడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లాలో వికారాబాద్ తాండూర్ పరిగి చేవెళ్ల కొడంగల్ నియోజకవర్గాల నుండి భారీ మెజార్టీతో గెలిపించుకొని ఈ ప్రాంతం నుంచి ప్రాముఖ్యతను చాటుకోవాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా మాజీ మంత్రులు చంద్రశేఖర్ ప్రసాద్ కుమార్ పోటీ పడడంతో మధ్యలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపొందుతున్నాడని మాజీ మంత్రి చంద్రశేఖర్ కు సమజాయించి జహిరాబాద్ టికెట్ ఇప్పించడం జరిగిందని ఇక వికారాబాద్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం ప్రసాద్ కుమార్ విజయం ఖాయం అయిపోయినట్లు అయిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం కార్యక్రమంలోని ఆర్ గ్యారంటీలను సోనియాగాంధీ ఆధ్వర్యంలో అమల్లోకి తీసుకువస్తామని తెలిపారు. నిరుద్యోగులకు భారీగా డీఎస్సీ మొదలగు నోటిఫికేషన్లు వేసి ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి అభివృద్ధికి బాటలు వేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. వికారాబాద్ ప్రాంతంలో రెండు పర్యాయాలుగా మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ ఓటమిపాలైనప్పటికీ ప్రజాసేవకే అంకితం అవుతూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో గెలుపొందిన టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎలాంటి అభివృద్ధి చేయలేదని మాజీమంత్రి ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యపడిందని శాటిలైట్ టౌన్షిప్ రోడ్లు గురుకుల పాఠశాలలు అనేక విధాలుగా అభివృద్ధి సాధ్యపడిందన్నారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టో డూప్లికేట్ మేనిఫెస్టో గా రేవంత్ రెడ్డి పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోను కాపీ కొడుతూ మేనిఫెస్టో రూపొందించారని రెండుసార్లుగా మోసం చేసిన తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్ మేనిఫెస్టోను ఆయన మాటలను నమ్మడం లేదని ఆయన కుమారుడు మాయమాటలు చెబుతూ ప్రజలను మోసం చేసేందుకు బయలుదేరాడని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ రెండు పర్యాయాలుగా ఓటమిపాలైనప్పటికీ ప్రజాసేవ లక్ష్యంగా పనిచేస్తూ ముందుకు సాగుతున్నానని మరోసారి అలా చేయకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలో తీర్చిదిద్దుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ వికారాబాద్ ప్రాంతం నుంచి నాకు ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిపించారని మీరు ఇచ్చిన డిగ్రీతోనే నాకు జహిరాబాద్ కాంగ్రెస్ పార్టీ టికెట్ లభించిందని జహీరాబాద్లో ప్రజలు బొమ్మరసం పడుతున్నారని గెలుపు ఖాయంగా ఉందని మాజీ మంత్రి చంద్రశేఖర్ తెలిపారు. గత ఎన్నికల్లో ప్రసాద్ కుమార్ నేను పోటీలో నిలవడంతో మధ్యలోంచి ఎమ్మెల్యే ఆనంద్ గెలిచారని ఎమ్మెల్యే ఆనంద్ గెలుపుతో వికారాబాద్ అభివృద్ధిలో వెనక వేయబడిందని అలా కాకుండా మరోసారి మోసపోవద్దని ప్రసాద్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటేనే వికారాబాద్ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భీమ్ భరత్ పరిగి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే అభ్యర్థి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి తాండూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనోహర్ రెడ్డి వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
**ఎనుముల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ కొండల్ రెడ్డి దారూర్ మాజీ పిఎసిఎస్ చైర్మన్ హనుమంత్ రెడ్డి పార్టీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పిటిసి ముత్తార్ షరీఫ్ రామేశ్వర్ భారీ సంఖ్యలో నాయకుల కార్యకర్తలతో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కాంగ్రెస్ పార్టీ విజయభేరి సభ సక్సెస్..
వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ సక్సెస్ అయ్యింది. మాజీమంత్రి ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు వికారాబాద్ నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాజీమంత్రి ప్రసాద్ కుమార్ అభిమానులు సభలో డ్యాన్సులు చేశారు.