కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

అక్కడిక్కడే ఆరుగురు దుర్మరణం

కామారెడ్డి, ప్రజాతంత్ర, జూలై 18 : కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం జిల్లాలోని 161వ జాతీయ రహదారి మద్నూరు మండలం మెనూరు వద్ద లారీ-ఆటో ఢీకొట్టుకున్న ఘటనలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. అందిన వివరాల్లోకి వెళితే మద్నూరు నుంచి బిచ్కుంద వైపు జాతీయ రహదారిపై ఆటో రాంగ్‌రూట్‌లో వెళ్తుండగా అదే సమయంలో హైదరాబాద్‌ ‌నుంచి గుజరాత్‌ ‌వైపు కంటైనర్‌ ‌లారీ వెళ్తున్న క్రమంలో లారీని ఆటో ఢీకొనడం రెండు వాహనాలు వేగంగా ఉండడంతో ఆటో నుజ్జునుజ్జయ్యింది. లారీ ముందుభాగంలోకి ఆటో చొచ్చుకువెళ్లింది.

పూర్తి వివరాలు తెలియాల్సొ ఉన్నా ఆరుగురి మృతదేహాలు మాత్రం బయటకు కనిపిస్తున్నాయని పోలీసులు తెలిపారు. ఆటోను బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆటో రాంగ్‌రూట్‌లో వేగంగా రావడం అదే సమయంలో కంటైనర్‌ ‌వేగంగా ఉండడంతో ప్రమాదం తీవ్రత అధికంగా ఉందని పోలీసులు తెలిపారు. మృతులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page