స్వేచ్ఛగా, యధేచ్చగా భారత ప్రభుత్వం మరియు ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర ప్రభుత్వాలతో రహస్యంగా టాటా, ఎస్‌ఆర్, జిందాల్, వేదాంత ఇతర కార్పొరేట్ కంపెనీలు కుదుర్చుకున్న వందల కోట్ల విలువైన ఎం.వో.యు లను అమలుపరచడానికే ఎలాంటి అడ్డు అదుపు లేకుండా వందల సంవత్సరాల పాటు అక్కడున్న స్టీల్, ఐరన్, గ్రాఫైట్, బొగ్గు, సున్నపురాయి, యురేనియం మొదలగు 27 రకాల, లక్షల కోట్లు విలువచేసే ప్రకృతి సంపదను ఖనిజాలను తొవ్వుకోవడాని ప్రపంచ మార్కెట్లో అమ్ముకోవడానికే లాభాలు సంపాదించుకోవడానికే ఆపరేషన్ కగార్.
డిసెంబర్ 31న తప్ప తాగి అమానవీయంగా ఆదివాసుల మీద దాడికి పాల్పడి స్త్రీలను చెరచి గూడాలనే కాలపెట్టి వారి బతుకుల మీద నియంత్రణ లేని నియంత, డిఆర్‌జి బాలగాలా చేతికి అందించిన తుపాకీ గుండు పేల్చింది మొదలు ఆపరేషన్ కగార్ కై బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు కనుసన్నల్లో అర్థ సైనిక బలగాలతో ఈ దేశ ఆదివాసుల మీద వారికి అండగా ఉంటున్న మావోయిస్టుల మీద అంతర్గత అప్రకటిత యుద్ధాన్ని సాగిస్తున్నది ఈ రాజ్యం/పాలకులు. భారత రాజ్యాంగం ఐదవ ఆరవ షెడ్యూలలో ఆదివాసులకు వాళ్ళనివాస ప్రాంతాలకు కల్పించిన ప్రత్యేక భద్రతను హక్కులను ఈ పాలకులు బేఖాతరు చేసి ఛత్తీస్ ఘడ్ అడవుల్లో ప్రతి రెండు కిలోమీటర్లకు పోలీస్ క్యాంపులు వేస్తూ వేళ కొద్ది సి ఆర్ పి ఎఫ్, ఐ టి బిపి, బిఎస్‌ఎఫ్, కమాండోస్,స్కార్పియో, గ్రేహౌండ్స్ మరియు డి ఆర్ జి బలగాలను మోపుతూ లక్షల కోట్ల విలువైన ప్రకృతి ఖనిజ సంపద కలిగివున్న సారవంతమైన భూమి/ అడవుల్లో జీవిస్తున్న ఆదివాసీలకు వారి హక్కుల భద్రత రక్షణకై నిలుస్తున్న మావోయిస్టులను అంతమొందించడానికి,చంపేయడానికే పూర్తిగా అడవుల్లో నుంచి వాళ్లను రూపుమాపడానికే ఈ యుద్ధం ఆపరేషన్ కగార్.
స్వేచ్ఛగా, యేదేచ్ఛగా భారత ప్రభుత్వం మరియు ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర ప్రభుత్వాలతో రహస్యంగా టాటా, ఎస్‌ఆర్, జిందాల్, వేదాంత ఇతర కార్పోరేట్ కంపెనీలు కుదుర్చుకున్న వందల కోట్ల విలువైన ఎం.వో.యు లను అమలుపరచడానికే ఎలాంటి అడ్డు అదుపు లేకుండా వందల సంవత్సరాల పాటు అక్కడున్న స్టీల్, ఐరన్, గ్రాఫైట్, బొగ్గు, సున్నపురాయి, యురేనియం మొదలగు 27 రకాల, లక్షల కోట్లు విలువచేసే ప్రకృతి సంపదను ఖనిజాలను తొవ్వుకోవడాని ప్రపంచ మార్కెట్లో అమ్ముకోవడానికే లాభాలు సంపాదించుకోవడానికే ఆపరేషన్ కగార్. ప్రపంచ దేశాల్లో నూట ఏడవ స్థానం నుండి నూట పదకొండు కు పడిపోయిన భారత దేశ ప్రజలను ప్రపంచ ఆకలి సూచి నుండి బయటపడేయడానికో అత్యంత దుర్భర
దారిద్య్రంలో ఉన్న కోట్ల మందిని మధ్యతరగతికి తీసుకురావడానికో ప్రపంచ దేశాల్లో 159 వ స్థానంలో ఉన్న పత్రిక స్వేచ్ఛ స్థాయిని సంపూర్ణ స్వేచ్ఛాయుతల్ని చేయడానికో దేశ సంపదను దేశ ప్రజలకు పంచడానికో ఉత్పత్తి చేసే శ్రామిక వర్గాన్ని ఉత్పత్తి సంపదలో భాగస్వామ్యూల్ని చేయడానికో కాదు ఆపరేషన్ కగార్- దేశ అడవుల్లో 80 శాతం ఉన్న ప్రకృతి సంపదను ప్రపంచ మార్కెట్లో స్వేచ్ఛగా కార్పోరేట్లు పాలకులు కుమ్మక్కై అమ్ముకోవడానికి ఈ రాజ్యాంగబద్ధ చట్టాలు అర్థ సైనిక చర్యలు పాలకులు వారి అధికారాన్ని నిలుపుకోవడానికే ఈ నరమేధం.
నేటికీ పోలీసులు చెప్పే డెబ్బై ఒక్క ఎన్కౌంటర్లల్లో నూట ఇరవై మూడు మంది ఆదివాసుల మావోయిస్టులు చనిపోయారు. ఇవన్నీ ఎన్కౌంటర్లు కాదు అసలు ఎన్కౌంటర్ అనేదానికే చట్టబద్ధత లేదు. అక్కడ ఆదివాసీల, మావోయిస్టులు ఉన్నారనే ముందస్తు ఇన్ఫార్మర్ సమాచారంతోనో లేదా డ్రోన్లు ద్వారా కూంబింగ్ జరిపాకే సాయుధ అర్థ సైనిక బలగాలు సంసిద్ధమై వెళుతున్నప్పుడు ఒక ప్రతిఘటన అనివార్యమే. లాయర్ ఆర్కిటెక్ట్ ఫిలాసఫర్ మూడవ అమెరికా అధ్యక్షుడు అయిన థామస్ జఫర్సన్ అన్నట్లు ‘‘ అన్యాయమే చట్టమైనప్పుడు ఎదురించడమే నీ బాధ్యత కావాలి ’’దేశ ప్రజలు తాము రాసుకొని తమకు తాముగా ఇచ్చుకున్న రాజ్యాంగాన్ని రాజ్యాంగం ద్వారా అధికారాన్ని పొందిన పాలకులు రాజ్యాంగాన్ని దాని ద్వారా ప్రజలు పొందిన హక్కులను కాలరాస్తూ నియంతలై కార్పోరేట్ల ప్రయోజనాలే దేశ ప్రయోజనాలుగా చలామణి చేస్తున్నప్పుడు ఇక ఎదిరించడమే ప్రతి చర్య, విప్లవోద్యమాలె విముక్తి మార్గాలు.
-క్రాంతి
9848891008