శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, ఆగస్టు 8:కాలనీలల్లో నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కార దిశగాచర్యలుతీసుకుంటా గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చి బౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి గల రాజీవ్ నగర్ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు కాలనీ వాసులు తో కలిసి పర్యటించి ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా ఉన్న మురుగు నీటి కాలువ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవటం జరుగుతుందని, సరైన చర్యలు తీసుకోకపోవటం,శుభ్రం చెయ్యకపోవటం వల్ల తరచూ అనారోగ్యపాలుకావాల్సి వస్తోందని కాలనీ వాసులు కార్పొరేటర్ దృష్టికి తీసుకుని వచ్చారు. మురుగు కాలువలో చెత్త వెయ్యటం వలన దాని వల్ల దోమలు బెడద ఎక్కువగా ఉందని,కావున తక్షణమే చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరారు.ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ రాజీవ్ నగర్ కాలనీ నెలకొన్న సమస్యలపై వెంటనే తగు చర్యలు తీసుకోని, మురుగు కాలువ పనులు చేపడాతమని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు.అనంతరం తమ కాలనీలో భూగర్భడ్రైనేజీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు కొత్త డ్రైనేజీ లైన్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కార్పొరేటర్ అధికారులను ఆదేశించారు.అందుకు కావలసిన వ్యయ ప్రణాళికలు రూపొందించి పనులు త్వరగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు.పెరుగుతున్న జనాభా దృష్ట్యా డ్రెయినేజీ పైప్ లైన్ డయా పెంచి లెవల్స్ తో అనుసంధానం చేస్తూ ఒక్క కాలనీ నుండి మరొక కాలనీ కి మధ్యన ఇబ్బందులు తల్లెత్తకుండ పనులు ప్రణాళిక బద్దంగా అన్ని కాలనీలకు దశలవారీగా మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని అన్నారు.ఎటువంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకోని రావాలని ప్రజలను కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో గోపనపల్లి తండా వడ్డెర సంఘం అధ్యక్షుడు శ్రీరాములు, సీనియర్ నాయకులు మురగ,స్థానిక నేతలు చిన్న,రాజు,మునియప్ప, నరసింహ్మ,రోజా,సుశీల,కృష్ణ వేణు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.