శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 17: కులమతాలకతీతంగా సంక్షేమ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ అన్నారు. ఈ మేరకు ఆయన మదినగూడ కిన్నెర గార్డెన్ లో జరిగిన పాస్టర్ అసోసియేషన్ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశంలో అతిపెద్ద పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీఅని, దేశం కోసం దేశ ప్రజలకోసం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు తమ ప్రాణాలను అర్పించారని తెలిపారు. కుల మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని, అన్ని మతాల కులాల వారిని గౌరవిస్తూ ఎన్నో సంవత్సరాలుగా వారి సంక్షేమం అభివృద్ధికి కృషి చేసిందని పేర్కొన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ఉన్న పాస్టర్ పాస్టర్ అసోసియేషన్ కు ఎల్లవేళలా తన మద్దతు, సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేశారు. పాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మద్దతు తెలిపినందుకు జగదీశ్వర్ గౌడ్ పేరుపేరునా వారికి కృతజ్ఞతలు తెలిపారు.మియాపూర్ మక్త, గచ్చిబౌలి డివిజన్ పరిధిల నుండి వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు జగదీశ్వర్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వంద రోజులలో ఆరు గ్యారెంటీ పథకాల అమలు చేస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులతో చెలగాటమాడుతున్న టిఆర్ఎస్ పార్టీ కి తగిన రీతిలో బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, శేరిలింగంపల్లి నియోజకవర్గంనుండి తను ఆదరించి కాంగ్రెస్ పార్టీ నుంచి అత్యధికమైన మెజార్టీతో గెలిపించాలని కోరారు.