అంగీకరించిన ఉభయ తెలుగు రాష్ట్రాలు
షరతుల మేరకే అంగీకరించామని…పూర్తి స్థాయిలో అప్పగించ లేదని తెలంగాణ ఈఎన్‌సి మురళీధర్ వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 1 : కృష్ణా బోర్డు పరిధిలోకి ప్రాజెక్టుల ఆపరేషన్‌కు తెలంగాణ, ఏపీ అంగీకారం తెలిపాయి. హైదరాబాద్‌లో కృష్ణా రివర్ బోర్డు సమావేశం గురువారం జరిగింది. సమావేశం అనంతరం తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్ విూడియాతో మాట్లాడుతూ..కొన్ని షరతుల మేరకు ప్రాజెక్టుల ఆపరేటింగ్ అంతా కేఆర్‌ఎంబీకి అప్పగించడానికి అంగీకరించామని, అయితే పవర్ స్టేషన్స్‌పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. నాగార్జున సాగర్ తెలంగాణ, శ్రీశైలం ఏపీ చూసుకుంటుందని, ప్రాజెక్టులన్నీ ఇక నుంచి బోర్డు పరిధిలో నడుస్తాయని, తమ డిమాండ్స్ అన్ని కేంద్రానికి లేఖలు రాశామని, ఇంకా అక్కడ నుంచి పూర్తి స్థాయిలో నిర్ణయం రాలేదని ఆయన పేర్కొన్నారు.
నీటి వాటాల పంపకంపై త్రిసభ్య కమిటీనే నిర్ణయం తీసుకుంటుందని, ప్రాజెక్టుల వద్ద భద్రత అనేది పరిస్థితిని బట్టి బోర్డు కనుసన్నల్లో జరుగుతుందన్నారు. కేఆర్‌ఎంబీ పరిధిలో ఉన్న 15 ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకి వెళ్తాయని, ప్రాజెక్టులను పూర్తిగా అప్పగించలేదని, ఆపరేషనల్, నీటి విడుదల, సీఆర్‌పీఎఫ్ లను కృష్ణా బోర్డు పరిధిలోనే ఉంటాయని మురళీధర్ అన్నారు. నిర్వహణ కోసం స్టాప్ కేటాయింపు 40 : 45 కావాలని అడుగుతున్నారని ాయన వివరించారు. ఇక ఏపీఈఎన్‌సీ నారాయణరెడ్డి మాట్లాడుతూ..బోర్డు పరిధిలో మొత్తం 15 కాంపోనెంట్స్‌లో 9 తెలంగాణ, 6 ఆంధప్రదేశ్‌వి ఉన్నాయని, కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఆపరేషన్ కోసం ఇరు రాష్ట్రాల నుంచి స్టాప్ కేటాయింపు ఉంటుందని, వాటర్ కేటాయింపులపై త్రిసభ్య కమిటీ దే తుది నిర్ణయమన్నారు. ప్రాజెక్టుల ఆపరేషనల్ ప్రోటోకాల్ త్రిసభ్య కమిటీ అప్పుడున్న పరిస్థితుల్లో తీసుకుంటారని, లెప్ట్ మెన్ కెనాల్ నుంచి రెండు టీఎంసీ, మార్చిలో రైట్ మెన్ కెనాల్ నుంచి మూడు టీఎంసీలు ఏపీకి విడుదలకు ఒప్పుకున్నారన్నారు. ఏప్రిల్‌లో ఐదు టీఎంసీలు ఏపీకి ముందుగానే ఉన్నాయి. ప్రాజెక్టుల ఆపరేషన్ కోసం తెలంగాణ ఒప్పుకుందని నారాయణరెడ్డి వెల్లడిరచారు.