ప్రముఖ నడుడు, రచయిత తనికెళ్ల భరణి చేతులమీదుగా ప్రశంసాపత్రం
కెనడా, జూన్ 16 : ఒంటారియో తెలుగు ఫౌండేషన్ (భవిష్యత్ తరాల ప్రగతి వేదిక ) ఆధ్వర్యంలో కెనడాలో తెలంగాణ హైదరాబాద్ కు చెందిన కుమారి దేవులపల్లి సుమాలిక చేసిన నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఈనెల 15న కెనడాలో ఒంటారియో తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీసీతారామ సేవా మందిర్ సౌజన్యంతో గ్రాండ్ సిన్నమాన్ కన్వెన్షన్ సెంటర్, స్కార్ భోరో, కెనడాలో సాహిత్యం -పద్యం -సంగీతం పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో తెలుగు వారు, కళాభిమానులు, సాహితి ప్రియులు, హాజరయ్యారు. ఈ వేడుకలకు విలక్షణ నటుడు, రచయిత, గాయకుడు , దర్శకులు, తనికెళ్ళ భరణి ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్భంగా సుమాలిక ప్రదర్శించిన సంప్రదాయ నృత్యం అందరినీ ఆకట్టుకుంది.
కాగా సుమాలిక సవ్యసాచి, సిలికాన్ ఆంధ్ర నృత్యంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వండర్ రికార్డ్స్ తో పాటు పలు కళలలో రాణించినందునకు గాను వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, గత సంవత్సరం తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలలో కెనడాలో తెలుగు స్ఫూర్తి పురస్కారంతోపాటు మరెన్నో అవార్డ్స్ ను దేవులపల్లి అందుకున్నారు. కాగా సుమాలిక ప్రదర్శించిన సంప్రదాయ నృత్యం సబికులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్బంగా కార్యక్రమ నిర్వాహకులు ప్రవీణ్, శ్రీని సమక్షంలో, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తనికెళ్ళ భరణి శ్రీ సుమాలికకు ప్రశంసా పత్రం అందిస్తూ, కళారంగంలో అద్భుతంగా రాణిస్తున్నందుకు అభినందించారు.