కెయూ ఉమెన్స్ ‌హాస్టల్‌లో ఊడిపడ్డ పెచ్చులు

ఆందోళనకు దిగిన విద్యార్థులు
వరంగల్‌, ‌ప్రజాతంత్ర, జూలై 13 :  వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయ హాస్టల్‌లో సీలింగ్‌ ‌ఫ్యాన్‌ ఊడిపడిన విషయం మరువక ముందే మరో ఘటన చోటుచేసుకున్నది. వర్సిటీలోని పోతన ఉమెన్స్ ‌హాస్టల్‌లోని ఓ గదిలో శుక్రవారం అర్ధరాత్రి స్లాబ్‌ ‌పెచ్చులు ఊడిపడ్డాయి. అయితే ఆ సమయంలో గదిలో ఎవ్వరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అయితే ఈ ఘటపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. హాస్టల్‌లో ఉండాలంటే ప్రాణాలవి•దికి వొస్తున్నదని, ఎన్నిసార్లు వర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకుండా పోతున్నదని చెప్పారు. హాస్టల్‌ ‌వార్డెన్‌ను నిలదీశారు. పైకప్పు ఊడిన ఘటనపై విద్యార్థులు ఆందోళనకు దిగారు.

రాణిరుద్రమదేవి హాస్టల్‌ను పరిశీలించడానికి వొచ్చిన రిజిస్ట్రార్‌ ‌మల్లారెడ్డిని నిలదిశారు. హాస్టళ్లను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయనతో వాగ్వాదానికి దిగారు. రిజిస్ట్రార్‌  ‌గోబ్యాక్‌ అం‌టూ నినాదాలు చేశారు.కాగా, గత నెల 29న వర్సిటీ క్యాంపస్‌లోని ఉమెన్స్ ‌హాస్టల్‌లో సీలింగ్‌ ‌ఫ్యాన్‌ ఊడిపడటంతో పీజీ ఫస్ట్ ఇయర్‌ ‌చదువుతున్న లూనావత్‌ ‌సంధ్య అనే విద్యార్థిని తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఫ్యాన్‌ ‌వి•దపడంతో ఆమె తలకు తీవ్రగాయమైంది. తోటి విద్యార్థులు వెంటనే ఆమెను దవాఖానకు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page