హైదరాబాద్, పిఐబి, డిసెంబర్ 8 : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు కలిగిన గాయం బారి నుండి త్వరితగతిన కోలుకుని త్వరగా తిరిగి స్వస్థత చేకూరాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. గురువారం కెసిఆర్ కాలికి గాయం విషయం తెలిసిన అనంతరం ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యమం ద్వారా చేసిన ఒక సందేశంలో ప్రధాని..‘తెలంగాణ రాష్ట్ర పూర్వ ముఖ్యమంత్రి కెసిఆర్ గాయపడ్డారన్న కబురును విని దు:ఖం కలిగింది. ఆయన శీఘ్రంగా కోలుకోవాలని మరియు మంచి ఆరోగ్యాన్ని పొందాలని ఆ ఈశ్వరుడిని నేను ప్రార్థిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.