పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 8: ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో వడ్డెరల అభివృద్ధి సాధ్యమైందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి లు అన్నారు. రామచంద్రపురం డివిజన్ పరిధిలోని ఎస్ఎన్ కాలనీలో ఏర్పాటుచేసిన వడ్డెరల ఆత్మీయ సమ్మేళనానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన అనంతరం ఎన్ని వర్గాల సంక్షేమ అభివృద్ధికి సీఎం కేసీఆర్ వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారని తెలిపారు. కొనసాగుతున్న అభివృద్ధి సంక్షేమం మరింత ముందుకు వెళ్లాలంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయానికి ప్రతి ఒక్కరు నిబద్దతతో సహకారం అందించాలని కోరారు.అనంతరం అశోక్ నగర్ లో ఏర్పాటు చేసిన ఆక్సీలరీ కార్మికుల సమావేశానికి వారు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పుష్ప నగేష్, సింధు ఆదర్శ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు అంజయ్య, శంకర్ యాదవ్, బిఆర్ఎస్ పార్టీ సర్కిల్ అధ్యక్షుడు పరమేష్, సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.