కెసిఆర్‌ ‌హయాంలో ఆర్థిక విధ్వంసం…అరాచక పాలన

రాష్ట్రం నెత్తిన ఏడు లక్షల కోట్ల అప్పు పెట్టిన ఘనుడు
కరీంనగర్‌ ‌పర్యటనలో మంత్రి పొంగులేటి

కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, జూలై 19 : కేసీఆర్‌ ‌హయాంలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి అన్నారు. అధికారంలో ఉన్న పదేళ్లలో కేంద్రం నుంచి సరైన నిధులు తేలేకపోయారని ఎద్దేవా చేశారు. జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్‌ ‌పదేళ్ల పాలనపై ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ను జాతీయ పార్టీ అని చెప్పి బీఆర్‌ఎస్‌ ‌గా పేరు మార్చి పక్క రాష్ట్రాలతో గొడవలు పెట్టుకున్నారన్నారు.  ధనిక తెలంగాణను అప్పుల పాలు చేశారని, ఏడు లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రాన్ని ముంచారన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నో అరాచకాలను కేసీఆర్‌ ‌పాల్పడ్డారని దుయ్యబట్టారు. ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌తో పాటు ఇరిగేషన్‌, ‌విద్యుత్‌ ‌సంస్థల్లో కేసీఆర్‌ అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. బీఆర్‌ఎస్‌ ‌చేసిన తప్పులకు వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌ ‌త్వరలోనే పేకమేడ లాగా కూలిపోతుందన్నారు.

 

రైతుబంధు నిధులను రుణమాఫీ కోసం వాడామని బీఆర్‌ఎస్‌ ‌నేతలు చెప్పడం హాస్యాస్పదమన్నారు. రైతు భరోసా రైతులకు ఇచ్చి తీరుతామని చెప్పారు. ఏకకాలంలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసింది కాంగ్రెస్‌ ‌ప్రభుత్వమే అన్నారు. కేసీఆర్‌ ‌లాగా రుణమాఫీకి పదేళ్ల సమయం తీసుకోలేదని..అధికారంలోకి వొచ్చిన ఎనిమిది నెలల్లోనే రుణమాఫీ చేశామని తెలిపారు. వాస్తవాలను బిఆర్‌ఎస్‌ ‌నేతలు ఇంకా ఒప్పుకోవడం లేదని, కాంగ్రెస్‌ ‌నాయకులు బిఆర్‌ఎస్‌ ‌నాయకుల మాదిరి గొప్పలకు వెళ్లడం లేదని ఉద్ఘాటించారు. బీఆర్‌ఎస్‌ ‌చేసిన తప్పులకు శిక్ష తప్పదని హెచ్చరించారు. తాము గులాబీ పార్టీ లాగా గొప్పలకు వెళ్లడం లేదని స్పష్టం చేశారు. ధనిక తెలంగాణను గత సర్కార్‌ అప్పు‌ల పాలు చేసిందని మండిపడ్డారు. రూ. 7 లక్షల కోట్ల అప్పు చేసి పోయారని ఎద్దేవా చేశారు.

 

ఫోన్‌ ‌ట్యాప్‌, ఇరిగేషన్‌, ‌కరెంట్‌తో అరాచకాలు చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై ప్రతిపక్షాలు చేసే విమర్శలు నమ్మొద్దని మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి అన్నారు. రైతులను ఆందోళనకు గురిచేసేలా బీఆర్‌ఎస్‌ ‌నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కుటుంబ నిర్దారణకు మాత్రమే రేషన్‌ ‌కార్డు ప్రమాణికమని తెలిపారు. రేషన్‌ ‌కార్డు లేకున్నా రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. రేషన్‌ ‌కార్డు పేరుతో ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దని అన్నారు. కొత్త రేషన్‌ ‌కార్డులు ఇస్తామని హావి• ఇచ్చారు. ఆరోగ్య శ్రీ, రేషన్‌ ‌కార్డులు వేర్వేరుగా ఇస్తామని తెలిపారు. ఒకదానితో ఒకటి లింక్‌ ‌పెట్టబోమని అన్నారు. కొత్త రేషన్‌ ‌కార్డులకు మార్గదర్శకాలు ఆలోచిస్తున్నామని వివరించారు. మాజీ మంత్రి కేటీఆర్‌కు ఏం చేయాలో అర్థం కావడం లేదని అన్నారు. తాము రూ.31 వేల కోట్లు రుణమాఫీ చేస్తున్నామని ప్రకటించారు.కేసీఆర్‌ ‌చేసింది పదేళల్లో 25 వేల కోట్ల రుణమాఫీ మాత్రమేనని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page