కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి

అదానీ గ్రూపు అక్రమాలపై నిస్పక్షపాత దర్యాప్తు చేయించాలని గత కొద్ది రోజులుగా ప్రతిపక్షాల్లు ఉభయ పార్లమెంట్‌ ‌సభలను స్థంభింపజేస్తున్నా కేంద్ర ప్రభుత్వం అందుకు అంగీకరించక మొండివైఖరి ప్రదర్శించదం దురదృష్టకరం. విచిత్రంగా ప్రభుత్వం వలే అదానీ గ్రూపు సంస్థలకు వేల కోట్ల ఋణాలు ఇచ్చిన తమ ఉదార వైఖరిని సమర్థించుకొనేందుకు ఆర్థిక సంస్థలు కూడా తంటాలు పడుతున్నాయి. బ్యాంకింగ్‌ ‌వ్యవస్థ చాలా పటిష్టంగా, సుస్థిరంగా ఉందని మొదటినుండి పాట పాడుతున్న కేంద్ర ప్రభుత్వం దేశ చరిత్రలోఏ అత్యంత ఖరీదైన కుంభకోణంలో ఆ గ్రూపు సంస్థలకు ఎలా వేల కొట్ల రుణాలను ఇచ్చారన్న అంశం పై పెదవి విప్పడం లేదు.

మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్లు దాదాపు 12లక్షల కోట్లరూపాయలు ఎగవేయగా వారి అప్పులన్నీ రద్దుచేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఫలితంగా ఆర్ధిక వ్యవస్థ పతనం వైపు సాగుతోంది. ఈ తొమ్మిదేళ్ళ కాలంలో ఒక్క ఆర్ధిక నేరస్థుడిని కూదా స్వదేశానికి రప్పించలేకపోయారంటే మన చట్టాల బలహీనత ఏమిటో ఇట్టే అర్ధమౌతోంది.తాజా పరిణామాలు భారతదేశ ప్రతిష్టను దెబ్బతీసేవిగా ఉన్నాయి. మొత్తం ప్రపంచం మన ఆర్ధిక చట్టాలపైనే వ్యాఖ్యలు చేస్తున్నాయి. విదేశాలలో, స్వదేశంలో కూడా మన భారీ కంపెనీల వ్యాపార లావాదేవీలపై విశ్వాసం సన్నగిల్లుతుంది.
– సి హెచ్‌ ‌ప్రతాప్‌, ‌ఫ్లాట్‌ ‌నెంబర్‌ : 405,
‌శ్రీ బాలాజీ డిలైట్స్, ‌రాహుల్‌ ‌కోలనీ,
ఎ ఎస్‌ ‌రావు నగర్‌
‌సాయి సుధీర్‌ ‌కాలేజీ వద్ద, హైదరాబాద్‌ 500 062,
95508 51075

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page