కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 8: మహేశ్వరం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి నామినేషన్ కు కందుకూరు మండలం నుండి పలు గ్రామాల్లో ఉన్న నాయకులు,కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలి వెళ్లారు.కందుకూరు మండల పరిధిలోని వివిధ గ్రామాల నుండి బైకు ర్యాలీలతో పాటు స్వచ్ఛందంగా ప్రజలు మహేశ్వరం మండల కేంద్రంలో ఉన్న తహసిల్దార్ కార్యాలయానికి భారీగా చేరుకొని ఆటపాటలతో కిచ్చన్న గారికి స్వాగతం పలికారు.అభిమానుల మధ్య కార్యకర్తల మధ్య నాయకుల మధ్య కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి ఉత్సాహంగా కనబడుతూ ప్రజలకు అభివాదం చేసుకుంటూ మంచి జోష్ తో నామినేషన్ వేయడానికి తరలి వెళ్లారు.అభిమానుల కేరింతలు కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు జేజేలు పలుకుతూ ఆయనకు మంచి ఊపునందించాలని నియోజకవర్గ నాయకులు,మండల నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.ఎక్కడ చూసినా జై కొడుకు కేఎల్ఆర్ కు స్వాగతం పలుకుతూ తమ తమ అభిమానాన్ని చాటుకున్నారు.కనిపించిన కేఎల్ఆర్ అందరిని కుటుంబ సభ్యులుగా కొనియాడుతూ జేజేలు పలుకుతూ ఆయన తన నామినేషన్ ఎన్నికల అధికారికి అందజేశారు.ఆయన వెంట నియోజక వర్గ సీనియర్ నాయకులు జంగారెడ్డి,దేపా భాస్కర్ రెడ్డి,అమరేందర్ రెడ్డి,పారిజాతం తదితరులు పాల్గొన్నారు.