తాను కందిపప్పు లాంటివాణ్ణని.. కందిపప్పు ఆరోగ్యానికి మంచిదని కేటీఆర్కు రేవంత్ రెడ్డి కౌంటరిచ్చారు. తమ కొడంగల్, తాండూరు ప్రాంతాల్లో కంది పప్పుకు మంచి పేరుందని, అందుకే తాను కందిపప్పునని, కానీ కేటీఆర్ గన్నేరు పప్పు లాంటివాడని, అది తింటే చస్తారని రేవంత్ ఎద్దేవా చేశారు. ఆరోగ్యం బాగుండాలంటే కందిపప్పు, ముద్దపప్పును తీసుకోండని, గన్నేరు పప్పును కాదని రేవంత్ రెడ్డి సెటైర్ వేశారు.