ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 16 : కల్వకుర్తి నియోజకవర్గం లో బిఆర్ఎస్ టికెట్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు ఇస్తే ఓడిపోతాడని పలు సర్వేలు, ఇంటిలిజెన్స్ రిపోర్టులు తెప్పించుకున్న మంత్రి కేటీఆర్, కసిరెడ్డి నారాయణరెడ్డి తో జరిగిన లోపాయి కారి ఒప్పందంతోనే..? ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ దక్కించుకున్నాడని..? కేటీఆర్ వదిలిన బాణమే కసిరెడ్డి నారాయణరెడ్డి అని కెసిఆర్ వదిలిన బాణం ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అని బిజెపి అభ్యర్థి తల్లోజు ఆచారి అన్నారు. సోమవారం కల్వకుర్తి పట్టణంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆచారి మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి కి ఇంకా ఐదు సంవత్సరాలు పదవి కాలం ఉన్న ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆలోచన ఎలా వచ్చిందన్నారు. ఇదంతా కేటీఆర్ కుట్రలో భాగమేనన్నారు. కల్వకుర్తి బిఆర్ఎస్ టికెట్ ఆశించినోడివైతే ఎమ్మెల్సీ గా పోటీచేసి ఎందుకు గెలిచావని ఆచారి ప్రశ్నించారు..? కల్వకుర్తిలో బిజెపి బలమైన శక్తిగా ఉండటం సర్వేలన్నీ బిజెపికి అనుకూలంగా వచ్చాయని రెండుసార్లు తాను గెలుపుకు దగ్గరికి వచ్చి ఓడిపోయానని ఇదంతా కేటీఆర్ ఆడిస్తున్న నాటకం అని అన్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో నారాయణరెడ్డి గెలిస్తే మళ్లీ బిఆర్ఎస్ లో చేరవచ్చని ఒకవేళ జైపాల్ యాదవ్ గెలిస్తే తన ఎమ్మెల్సీ పదవి అలానే ఉంటుందని ఇదంతా కుట్రలో భాగంగానే జరుగుతున్నట్లు ప్రజలు అనుమానిస్తున్నారని ఆచారి నిండు సభలో ఆవేదనను వెలగక్కారు.