- సమైక్యత ఉత్సవాలకు పిలుపునిస్తే స్పందన లేదని రేపు సెలవు ప్రకటన
- విమోచన దినోత్సవాలు జరపకుండా అడ్డుకునేందుకే ‘‘సెలవు’’ కుట్ర
- ప్రజలు… నీకు, నీ పార్టీకి శాశ్వతంగా సెలవిచ్చే రోజులు రాబోతున్నయ్
ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కాలేజీలుసహా విద్యా సంస్థలన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వం రేపు సెలవు ప్రకటించడం వెనుక కుట్ర దాగి ఉంది.అని రాష్ట్ర బిజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రజాకార్ల రాక్షస పాలన నుండి విముక్తి పొందిన రోజున తెలంగాణ అంతటా ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలుసహా అన్ని విద్యా సంస్థలో జాతీయ జెండా ఎగరేసి తెలంగాణ విమోచన దినోత్సవాలు ఘనంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిస్తే… అందుకు భిన్నంగా జెండా ఎగరనీయకుండా కేసీఆర్ ప్రభుత్వం సెలవు ప్రకటించడం దుర్మార్గపు చర్య. ఇదేనా ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉన్న నిబద్ధత..అని ప్రశ్నించారు.
వజ్రోత్సవాల పేరుతో ఈరోజు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవాలు జరిపినా ప్రజల నుండి స్పందన లేదు. సొంత పార్టీ నేతల కుమ్మలాటలు, చిందులేయడానికే ఉత్సవాలు పరిమితమయ్యాయి.. అని పేర్కొంటూ.. తెలంగాణ విమోచన దినోత్సవాలు ఘనంగా జరిగితే బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ పేరొస్తోందననే భయంతోనే ‘‘సెలవు’’ పేరుతో కేసీఆర్ అడుగడుగునా అడ్డంకులు స్రుష్టిస్తున్నారు. ..తెలంగాణ విమోచన దినోత్సవాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తున్నారని తెలిసి కేసీఆర్ గజగజ వణికిపోతున్నడు. నాటి నిజాం సంస్థానంలో భాగమైన మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం పరేడ్ గ్రౌండ్ లో జరిగే విమోచన దినోత్సవాల్లో పాల్గొంటుండటంతో తట్టుకోలేక చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నడు.
విమోచన దినోత్సవాలు జరగకుండా పోస్టర్లు చింపుతున్నడు. తప్పుడు ప్రచారం చేస్తున్నడు. గొడవలు స్రుష్టించే కుట్రకు తెరలేపిండు…కేసీఆర్… మీ కుటిల రాజకీయాలు ప్రజలు అర్ధమైనయ్… విద్యా సంస్థలకు సెలవు ప్రకటించి తాత్కాలిక ఆనంద పొందుతున్నవేమో… రాష్ర ప్రజలు నీకు, నీ పార్టీకి శాశ్వతంగా సెలవు ప్రకటించే రోజులు దగ్గర్లోనే ఉన్నయ్…అని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.