ఎమ్‌ఎల్యేలను ఎందుకు ప్రగతిభవన్‌లో పెట్టారు
ఎమ్మెల్యేల కొనుగోలుతో బిజెపికి సంబంధం లేదు
తడిబట్టలతో యాదాద్రిలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రమాణం
యాదాద్రి, ప్రజాతంత్ర, అక్టోబర్ 28 : టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుపై సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్… యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ప్రమాణం చేశారు. గుండంలో స్నానం చేసి తడిబట్టలతో ఆలయంలోకి వెళ్లిన సంజయ్.. గర్బగుడి ముందు నిల్చుని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలులో బీజేపీ లీడర్లకు ఎలాంటి ప్రమేయం లేదని ప్రమాణం చేశారు. సవాల్ ప్రకారం తాను ప్రమాణం చేశానని, ఇంతవరకు కేసీఆర్ ఎందుకు రాలేదని సంజయ్ ప్రశ్నించారు. బండి సంజయ్ యాదాద్రి పర్యటన నేపథ్యంలో అక్కడ హై టెన్షన్ నెలకొంది. సంజయ్ కు వ్యతిరేకంగా స్థానిక టీఆర్‌ఎస్ నేతలు నిరసనలు చేపట్టారు. బండి సంజయ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తాను యాదాద్రి వెళ్లి తీరతానని ముందుగానే చెప్పిన సంజయ్ అక్కడికి చేరుకుని ప్రమాణం చేశారు.
ఎమ్మెల్యేల కొనుగోలుతో బిజెపికి సంబంధం లేదు
కేసీఆర్ డైరెక్షన్ లో ఫాంహౌజ్ డ్రామా నడిచిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పునరుద్ఘాటించారు. కేసీఆర్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. యాదాద్రికి వెళ్లిన సంజయ్…ఫాంహౌజ్ కొనుగోళ్లపై తడిబట్టలతో ప్రమాణం చేశారు. బీజేపీపై కావాలనే తప్పుడు ఆరోపణలు చేశారన్న సంజయ్… దమ్ముంటే ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు వి•డియా ముందుకు ఎందుకు రావడం లేదని ఫైర్ అయ్యారు. వారిని ప్రగతిభవన్‌లో ఎందుకు దాచారని అన్నారు. మునుగోడులో ఓడిపోతామనే భయం కేసీఆర్ కు పట్టుకుందని అందుకే కొత్త కుట్రకు తెరలేపారన్నారు.
ఎమ్మెల్యేలను ప్రగతిభవన్ లో ఎందుకు దాచిపెట్టారు, స్వాధీనం చేసుకున్న రూ. 15 కోట్లు ఏమయ్యాయని సంజయ్ ప్రశ్నించారు. మునుగోడులో బీజేపీ గెలవడం ఖాయమన్న సంజయ్… ఈ ఉపఎన్నికతో టీఆర్‌ఎస్ కు సమాధి కడతమన్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుపై సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరిన సంజయ్.. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ప్రమాణం చేశారు. గుండంలో స్నానం చేసి తడిబట్టలతో ఆలయంలోకి వెళ్లిన సంజయ్.. గర్బగుడి ముందు నిల్చుని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలులో బీజేపీ లీడర్లకు ఎలాంటి ప్రమేయం లేదని ప్రమాణం చేశారు. సవాల్ ప్రకారం తాను ప్రమాణం చేశానని, ఇంతవరకు కేసీఆర్ ఎందుకు రాలేదని సంజయ్ ప్రశ్నించారు.