‘‘మునుగోడు ఉప ఎన్నిక నిమిత్తం ఇప్పటికే బీజేపీ తనదైన వ్యూహాలు సిద్ధం చేసింది.అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఎలాగూ తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతుంది.రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడైన వెంటనే హుజూరాబాద్ ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి పరిమితమైపోయిన సంగతి విధితమే..అప్పటికి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా కుదురుకోలేదు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.రేవంత్ రెడ్డి, మునుగోడులో ఎలాంటి రాజకీయ వ్యూహాన్ని అమలు చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ’’
తెలంగాణ రాష్ట్రంలో శరవేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపధ్యంలో ముందస్తు ఎన్నికలపై రాజకీయ పార్టీలు ఆసక్తికర చర్చకు ఆజ్యం పోస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నికల కంటే ముందుగా మొత్తం అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుందన్న చర్చ టిఆర్‌ఎస్ అధినేత మదిలో చక్కర్లు కొట్టుతున్నట్లు పార్టీలో గుస గుసలు వినపడుచున్నాయి. మునుగోడు ఉపఎన్నికల్లో ఓటమి పాలైతే భవిష్యత్త్ ఉండదనే మీమాంస బీజేపీ ,కాంగ్రెస్ పార్టీలలో డప్పులు మోగుతున్నాయి. టక్.టక్ మంటు జంగ్ సైరన్ గంటలు కొట్టుతున్నాయి.అధికార టిఆర్‌ఎస్ పార్టీలో కూడా మునుగోడు కైవసం చేసుకోక పోతే ఎలా? దీనిని బూచీగా చూపి రాష్ట్రంలో బలహీనపరచే కుట్రలకు దిగితుందేమో? వలసలకు ఆజ్యం పోస్తుందేమో అన్న భావన అందరిలో దాపరించింది.ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉనికి లేని బిజేపీకి కొమటిరెడ్డి బ్రదర్స్ ఊపిరి అయితే,ఒక్కసారిగా పుంజుకునే అవకాశం ఉంటుంది.అసలే కమ్యూనిస్టుల ఖిల్లాలో కాంగ్రెస్ పాగా వేస్తే కాంగ్రెస్ అనైక్యతతో టిఆర్‌ఎస్ కి పట్టం కట్టిన జిల్లా ప్రజల తీర్పుతో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతాయని భావిస్తున్నారు. మునుగోడులో బీజేపీ విజయం సాధిస్తే కొమటిరెడ్డి బ్రదర్స్ ప్రభావం నల్గొండలో, గోడమీద పిల్లిలా అసంతృప్తులు ఉన్న ఖమ్మం జిల్లాలో పార్టీని వీడే అవకాశం లేక పోలేదు.ఈ రెండు జిల్లాల్లోని ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా పడి పార్టీ మరింత బలోపేతం అయితే, అప్పుడు సాధారణ ఎన్నికలలో బిజెపిని ఎదు ర్కోవడం కష్టమవుతుందని టిఆర్‌ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి .కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తన పదవికి అలాగే పార్టీకి సైతం రాజీనామా చేసిన దరిమిలా, మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నిక రాబోతోంది.తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కఠిన పరీక్ష ఎదురు కాబోతోందనేది నిర్వివాదాంశం.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత, తమ్ముడు బాటలో అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారు అన్న చర్చ నల్గొండ జిల్లాలో ఊపందుకుంది.ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒక పక్క,ఈటల రాజేందర్ ఒక పక్క అధికార పార్టీ ఎమ్మ్యేల్యేలు టచ్ లో ఉన్నారని ఘంటాపథంగా చెబుతున్నారు.ఈటల 20 సంవత్సరాలు టిఆర్‌ఎస్ పార్టీలో ఉండడం వల్ల వ్యాఖ్యలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.రాష్ట్రంలో పరిణామాలు ప్రతికూలంగా మారకముందే టిఆర్‌ఎస్ పార్టీ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు పోతారేమోనన్న చర్చ ఆసక్తికరంగా మారింది. గతంలో దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు,కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన హుజురాబాద్ ఉప ఎన్నిక టిఆర్‌ఎస్ పార్టీని చావుదెబ్బ తీశాయి.రాష్ట్రంలో ఉనికి లేని బిజేపీ బలం పుంజుకోవడానికి,గత ఉపఎన్నికలు కారణంగా కనిపించాయి.
మునుగోడు ఉప ఎన్నికలో కూడా బిజెపి విజయం సాధిస్తే టిఆర్‌ఎస్ పార్టీలో అవకాశాల కోసం ఎదిరి చూస్తున్న అవకాశవాదులు బీజేపీ వైపు చూసే అవకాశం ఉంది. దానితో టిఆర్‌ఎస్ క్యాడర్ ఆత్మ స్థైర్యం దెబ్బతిని, బలహీనపడి ఇబ్బంది పడాల్సి వస్తుంది.అప్పుడు వలసల జోరును ఆపడం ఎవ్వరి తరం కాదని పార్టీ నేతలు భావిస్తున్నారు. వలసలు ఉంటాయనే ‘పీకే’ లీక్స్ కూడా ముందస్తుపై ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చిందేమో? అందుకే కేసీఆర్ వ్యూహం మార్చారా ? అంటే అందరి నోట ‘ఊ’ అనే సమాధానం వస్తుంది.అందుకే భవిష్యత్త్ విపత్తును ముందుగానే గ్రహించి బీజేపీని ఇరుకాటంలో పెట్టేందుకు కర్నాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటే ఎలక్షన్లకు వెళ్లాలని భావిస్తున్నారనే భావన రాష్ట్రం సర్వత్ర వినపడుతుంది.ముందస్తుకు పోవాలంటే ఆ లోపే ప్రజా సంక్షేమం పై దృష్టి సారించి ఇచ్చిన హామీలు, ముఖ్యమైన పనులన్నీ పూర్తిచేసిన తర్వాత అసెంబ్లీ రద్దు చేయాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు జోరుగా ఊహాగానాలు, మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
కేసీఆర్ ఈ నెలలోనే అసెంబ్లీ రద్దు చేసి ఈ ఏడాది డిసెంబర్ లో జరిగే హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికలతో పాటు తెలంగాణలోనూ ముందస్తు ఎలక్షన్స్ జరిగేలా ప్రణాళిక సిద్దం చేసారని ఒక వైపు, వచ్చే ఏడాది కర్నాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటు ముందస్తుకు వెళ్లాలని ఆలోచిస్తున్నారని ఒక వైపు, ఇదిలా ఉంటే మునుగోడు బరిలో దిగి కర్రు కాల్చి రెండు పార్టీలకు వాతలు పెట్టాలని,ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు బరిగీసి ప్రజాక్షేత్రంలో రెండు పార్టీలను మట్టికరిపించాలనే ఆలోచనలో అధినేత ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.అయితే ముందస్తుకు వెళ్ళి విజయం సాదించి, అదే ఊపులో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ఆలోచనకు, నల్ల చట్టాలతో రైతుల ఉసురు పోసుకుంటున్న బీజేపీని కేంద్రంలో గద్దె దింపేందుకు 26 రాష్ట్రాల నుండి రైతు సంఘాల ప్రతినిధులు జాతికి కేసీఆర్ లాంటి నాయకత్వం కావాలని, తెలంగాణలో అమలు జరుగుచున్న అన్ని పథకాలు దేశంలో అమలు జరుగాలంటే రైతు బంధువు జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టాలని ఆహ్వానించడం. బీజేపీ చేస్తున్న అరాచకాలు, ప్రభుత్వాలను కూలుస్తున్న తీరు అందరిని ఏకం చేస్తుందని, దీనికి కేసీఆర్ నాయకత్వం వహించాలని ఎదిరి చూస్తుంది. గుజరాత్ ఎన్నికలతో అసెంబ్లీని రద్దు చేసి, ముందస్తుకు వెళ్లాలనే ఆలోచనలో కేసీఆర్ కూడా ఉన్నారని, దీని ద్వారా ప్రత్యర్థులకు ఊపిరి ఆడకుండా చేయాలనే ఎత్తుగడ, ప్రశాంత్ కిశోర్ సూచనల మేరకు జరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విపక్షాలు కాంగ్రేస్ ఇంటి పోరుతో, అభ్యర్థులు లేక బీజేపీ కుదురుకునే లోగా ఎన్నికల బరిలో దూకితే ఫలితాలు కూడా టిఆర్‌ఎస్ కు అనుకూలంగా వస్తాయనేది జగద్విదితం.
మునుగోడు ఉప ఎన్నిక నిమిత్తం ఇప్పటికే బీజేపీ తనదైన వ్యూహాలు సిద్ధం చేసింది.అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఎలాగూ తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమ వుతుంది.రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడైన వెంటనే హుజూరాబాద్ ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి పరిమితమైపోయిన సంగతి విధితమే..అప్పటికి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా కుదురుకోలేదు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.రేవంత్ రెడ్డి, మునుగోడులో ఎలాంటి రాజకీయ వ్యూహాన్ని అమలు చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. పీసీసీ అధ్యక్షుడుగా పీకేస్తా, పొడిచేస్తా.. అంటూ చాలా ఆవేశంగా మాట్లాడుతున్నారు. మునుగోడులో సిట్టింగ్ స్థానం కాపాడుకోక పోతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వుంటుందా.? ఊడుతుందా ? అన్న ఆసక్తికర చర్చ జరుగుతుంది. అసలే పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ, అంతర్గత కుమ్ములాటలు, అసంతృప్తులు, అంతర్యుద్దానికి పుట్టినిల్లుగా పేరు గాంచింది.రెండు పర్యాయాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫేల్యూర్ తో సీనియర్లను కాదని టిడిపి నుంచి వచ్చిన జూనియర్ రేవంత్ రెడ్డికి పిసిసి పదవి కట్టబెట్టినప్పటి నుంచి ఇంటిపోరు ఓ రేంజ్ లో సాగుతుంది.తమకు దక్కాల్సిన పదవిని రేవంత్ రెడ్డి ఎత్తుకుపోయారని రకరకాల ఆరోపణలు బహిరంగంగానే చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు రాష్ట్రంలో టిఆర్‌ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల పుణ్యం అని ఇప్పుడు తన ఉనికిని కాపాడుకునే పరిస్థితిలో పడింది. ఒక వేళ మునుగోడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ను ఎవ్వరు ఓడించాల్సిన అవసరం లేదు… రేవంత్ ను సాగనంపే కుట్రలో సీనియర్స్ చాలు. కేసీఆర్ ముందస్తుతో.. కాంగ్రెస్ అధికారం వచ్చుడేమోగానీ మునుగోడు అపఖ్యాతి లేనట్లేనని, రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడుగా పదవి గండం తప్పిందనే అభిప్రాయం విశ్లేషకులు చెప్పడం గమనార్హం.
డా.సంగని మల్లేశ్వర్,
విభాగాధిపతి, జర్నలిజం శాఖ,
కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్,9866255355.