కొడంగల్‌ ‌నియోజకవర్గం లో రోజు రోజుకు ఖాలీ అవుతున్న బీ ఆర్‌ఎస్‌

దౌల్తాబాద్‌ ‌మండలంలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామ యువకులు వివిధ పార్టీల నుంచి పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ ‌పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్‌ ‌మాట్లాడుతూ రానున్న కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంలో యువకులకు పెద్దపిట్ట వేసి సమచిత స్థానం, ఉద్యోగాలు, ఉపాధి కల్పన లక్ష్యంగా పనిచేస్తామని ఆయన అన్నారు.

వచ్చే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంలో కొడంగల్‌ ‌నియోజకవర్గానికి ప్రత్యేక గజ్వేల్‌,‌సిరిసిల్ల,సిద్దిపేట ఏ విధమైన అభివృద్ధి జరిగిందో అంతకు రెట్టింపు అభివృద్ధి కొడంగల్‌ ‌నియోజకవర్గాన్ని చూస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు కొటం రాములు, అంజలిగారి నరసింహులు, ఆవిటి నరసింహులు,పొట్ట మల్లేష్‌,‌పొలం సందీప్‌ ‌యువకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page