- ధాన్యం సేకరణలో విధానం లేకుండా కెసిఆర్ వ్యాఖ్యలు
- బిజెపిపై కోపంతో రైతులకు నష్టం చేయొద్దు
- కేంద్రం నిబంధనల మేరకే ధాన్యం కొంటుంది
- ఎస్టీ రిజర్వేషన్ల బిల్లు కేంద్రానికి చేరకపోడం దారుణం
- మీడియా సమావేశంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్
ప్రజాతంత్ర, హైదరాబాద్, మార్చి 23 : సీఎం కేసీఆర్ బీజేపీపై ఉన్న కోపాన్ని రైతులపై చూపెడుతున్నారని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఓ ఏజెన్సీగా మాత్రమే పని చేస్తుందన్న ఆయన అందుకు అవసరమైన డబ్బును కేంద్రమే ఇస్తుందని స్పష్టం చేశారు. కోటి ఎకరాల మాగాణి అంటున్న కెసిఆర్ అందుకు ప్రణాళికలు లేకుండా పనిచేస్తున్నారని అన్నారు. వ్యవసాయరంగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యంత గందరగోళ పరిస్థితుల్లో ఉందని ఈటల వాపోయారు. కేసీఆర్ సర్కారుకు ముందు చూపులేక, చిన్నచూపు చూడటం వల్లే సమస్య ఉత్పన్నమవుతుందని విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కేసీఆర్ సర్కారు కూలిపోవడం ఖాయమని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతి పంటను కొనుగోలు చేస్తామని అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వి•డియాతో మాట్లాడిన ఆయన..రాష్ట్ర రైతాంగం ప్రయోజనాల కోసమే పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. కేంద్రం ధాన్యాన్ని కొనుగోలు చేయమని ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేసిన ఈటల… రైతులు పండించిన వడ్లను పార్టీ కార్యాలయాలు, ఇళ్ల ముందు పోస్తామని కేసీఆర్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ బీజేపీ వి•ద ఉన్న కోపాన్ని రైతుల వి•ద చూపెడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ధాన్యం సేకరణకు డబ్బులన్ని కేంద్రమే ఇస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం ఒక ఏజెన్సీగా మాత్రమే పనిచేస్తుందని, తెలంగాణ రాష్ట్రం వ్యవసాయంరంగంలో దేశంలోనే అత్యంత గందరగోళ పరిస్థితిలో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ధాన్యం సేకరణ కొత్తగా వొచ్చింది కాదు దశాబ్దాలుగా కొనసాగుతుందని, వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు వొచ్చాక పంట పెరిగిందన్నారు. ఫుడ్ కార్పొరేషన్ రెండు విధానాల్లో ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని, డీసీపీ పద్ధతిని తెలంగాణ రాష్ట్రం ఎంచుకుని ధాన్యాన్ని ఇస్తుందని, ముందుచూపు లేక చిన్నచూపు చూడటం వల్లే సమస్య ఉత్పన్నం అవుతుంద న్నారు. పార్టీ ఆఫీసుల మీద దాడులు, ధర్నాలు చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. వడ్లు పండించి పార్టీ కార్యాలయం, ఇళ్ల ముందు పోస్తామని కేసీఆర్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని, వరి వేయవద్దంటే..రైతుల పరిస్థితి ఏమి కావాలన్నారు.
కోటి ఎకరాల్లో పంట పండిస్తే కేసీఆర్ ఎక్కడ అమ్ముకుంటావు అని, తెలంగాణ కోటి ఎకరాల మాగాణి అంటివి కేసీఆర్ ఏమైందని ఆయన మండిపడ్డారు. కేంద్రం ధాన్యాన్ని కొనుగోలు చేయమని ఎక్కడా చెప్పలేదని, ఎప్పుడూ ఎన్నికలు వొచ్చిన కేసీఆర్ ప్రభుత్వం కూలిపోతుందని ఆయన వెల్లడించారు. బీజేపీ అధికారంలోకి వొచ్చాక ప్రతి పంటను కొనుగోలు చేస్తామని, రాష్ట్ర రైతాంగం ప్రయోజనాల కోసం తెలంగాణ బీజేపీ కృషి చేస్తుందని, జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు బిల్లు కేంద్రానికి పంపిన మాట వాస్తవమేనని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో బీజేపీలో ఈటల వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. ఎస్టీల రిజర్వేషన్ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిన మాట వాస్తవమేనని ఈటల అన్నారు. జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు.