కౌంట్‌డౌన్‌ ‌పేరుతో తెలంగాణ ఊపిరి తీయకండి …

త్యాగాల పునాదుల మీద వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ ఆకాంక్షలు నెరవేరడానికి ఉన్న అడ్డంకులకు కౌండ్‌డౌన్‌ ‌మొదలవుతుందనుకుంటే తల్లని చంపి బిడ్డకు ప్రాణం పోశారని తెలంగాణను అవమానించే మోడీ బిజేపి, తెలంగాణ తల్లిని తెలంగాణ ద్రోహులకు దారాదత్తం చేయాలనుకున్న కేసియార్‌ ఒకరికొకరు ‘‘కౌంట్‌డౌన్‌’’ ‌మొదలుపెట్టి తెలంగాణ ఊపిరి, పరువు, వారసత్వం అన్నీ మింగేస్తున్నారు.

జూలై 2న నరేంద్రమోడీ హైదరాబాద్‌ ‌వస్తున్న సందర్భంలో బిజేపి కార్యాలయంలో డిజిటల్‌ ‌క్యాంపెయిన్‌ ‘‘ ‌సాలు దొర-సెలవు దొరా!’’ అంటూ కేసియార్‌పై మొదలుపెడితే దానిపై జిహెచ్‌యంసితో కేసులు రాసి, హైదరాబాద్‌ ‌మెట్రో పిల్లర్లకు కేసియార్‌ ‌బొమ్మలు అతికేసి దిగజారుడు పనులకు తెరతీసింది టిఆర్‌యస్‌. ‘‘‌సాలు మోడీ, బైబై మోడీ’’ అంటు మరో కౌంట్‌డౌన్‌ ‌మొదలు పెట్టింది టిఆర్‌యస్‌. 529 ‌రోజుల సమయమే ఉన్నది కేసియార్‌ను ఇంటికి పంపిద్దామన్న బిజేపికి 5 రోజులు చాలు, చేసిన అవినీతీపై ఈడీతో దర్యాప్తు చేసి ఇంటికి పంపడానికి అని గుర్తుచేస్తున్నాం. మహారాష్ట్ర తీరుఇక్కడి ప్రభుత్వాన్ని కూల్చుతామనే బిజేపి కారుకు టక్కర్‌ ఇచ్చి ఇదివరకే సైకిల్‌ను ఇంటికి పంపిన ఉద్యమశక్తులు, బహుజన, ప్రజాస్వామిక ప్రభుత్వానికై దారులు వేద్దామంటే యు.పి తీరు బుల్డోజర్‌ ‌ప్రభుత్వం తెస్తానంటున్నది. డబుల్‌ ఇం‌జన్‌ అం‌టే బుల్డోజర్‌, ‌రోడ్డు రోలర్‌ అనే అర్ధమని తెలంగాణ ప్రజలకు తెలుసు.

ఒక వైపు ఉదయ్‌పూర్‌ ‌కిరాతక సంఘటన, మరో వైపు పౌరహక్కుల ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్‌, ‌మాజీ ఐఏయస్‌ ‌శ్రీకుమార్‌, ‌జర్నలిస్టు జుబేర్‌ అరెస్టులతో అట్టుడుకుతున్న దేశంలో బిజేపి దూకుడు ఏ విపరీత పరిస్థితులకు దారి తీస్తాయో ఊహించవచ్చు. మోడీ రాజ్యాంగం, కేసియార్‌ ‌సవరించాలంటున్న భారత రాజ్యాంగం అసలు ప్రజాస్వామిక వ్యవస్థలకే కౌంట్‌డౌన్‌గా ఉన్నది. రాజ్యహింసతో నలిగి గోసపడ్డ తెలంగాణా ఫాసిస్టు బిజేపి‘‘కొత్త దేవుడి రాజ్యం’’ను కోరుకోవడం లేదు.

సోషల్‌ ‌మీడియాలో అభిప్రాయాలు వెలిబుచ్చినా అరెస్టు చేయడంలో బిజెపి, టిఆర్‌యస్‌ ‌పోటీ పడుతున్నాయి. గిరిజనులను కాల్చివేసినా ముర్ము ఎన్నడూ మాట్లాడలేదన్న కేటియార్‌ ‌కనుసన్నల్లోనే వేలాది మంది గిరిజన పోడు రైతులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. వేల కోట్ల రూపాయల అవినీతికి తెలంగాణ ప్రభుత్వం పాల్పడుతుంటే, కేసియార్‌ను జైళ్ళో పెడతామనే బండి సంజయ్‌, ‌నడ్డా, తరుణ్‌ ‌చుగ్‌ ‌ప్రకటనలకే పరిమితమై చేస్తున్న విన్యాసాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను తుంగలో తొక్కి ఉద్యమకారులను తుంగలో తొక్కడంలో ఎవరూ తక్కువ కాదని గుర్తు చేస్తున్నాం. పరేడ్‌ ‌గ్రౌండ్‌లో బిజెపి చేసిన భూమిపూజ తెలంగాణ భూమికి రవ్వంతైన మేలు చేస్తే స్వాగతిస్తాం.
– డా చెరుకు సుధాకర్‌, ‌తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page