క్యాబ్‌లో ప్రయాణించి సమస్యలు తెలుసుకున్నలోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సమస్యల పరిష్కారానికి స్పష్టమైన విధానాలు రూపొందిస్తామని హమీ
న్యూదిల్లీ, ఆగస్ట్ 19 : కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో క్యాబ్ డ్రైవర్ల సమస్యలను పరిష్కరించేందుకు స్పష్టమైన విధానాలను రూపొందిస్తామని లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తెలిపారు. ఆ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు ఇండియా కూటమి కృషి చేస్తుందని స్పష్టం చేశారు. తక్కువ ఆదాయం, ద్రవ్యోల్బణం వల్ల క్యాబ్ డ్రైవర్లు లాంటి చిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారని, ఇది దేశంలోని కార్మికుల పరిస్థితికి అద్దం పడుతుందని అన్నారు. క్యాబ్ డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా మారుతుంది. రైడ్ బుక్ అయితేనే పని. లేదంటే లేదు.. తొలుత ఉబెర్, ఓలా ఇతర కంపెనీలు డ్రైవర్లకు మంచి కవి•షన్ ఇచ్చేవి. తర్వాత కవి•షన్లు తగ్గించాయి. రైడ్స్ ఆశించిన స్థాయిలో రావడం లేదు. మెట్రో పాలిటన్ సిటీలో కుటుంబాన్ని పోషించేంత ఆదాయం డ్రైవర్లు పొందడం లేదు. ఇదే విషయాన్ని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గుర్తు చేశారు. కాగా దిల్లీలో సోమవారం రాహుల్ గాంధీ ఉబెర్ క్యాబ్ బుక్ చేసుకుని ప్రయాణించారు.
ఉత్తరప్రదేశ్ ఎటాహ్కు చెందిన డ్రైవర్ సునీల్ ఉపాధ్యాయత్లో 11 నిమిషాల పాటు మాట్లాడారు. ఈ సందర్భంగా డ్రైవర్ తన సమస్యలను రాహుల్ గాంధీకి వివరించారు. ఆ వీడియోను రాహుల్ గాంధీ సోషల్ వి•డియా ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా రాహుల్ ……ఉబెర్ కారులో ప్రయాణించే సమయంలో డ్రైవర్ సునీల్ ఉపాధ్యాయ్‌తో ఇదే విషయం మాట్లాడా. తర్వాత అతని కుటుంబాన్ని కలిశాను. క్యాబ్ డ్రైవర్లు, డెలివరీ ఏజెంట్లు ఎదుర్కుంటున్న సమస్యలపై సవి•క్షించా. డ్రైవర్లు అహో రాత్రులు కష్టపడతారు. డ్రైవర్లు ఎలాంటి పొందుపు చేయరు. కుటుంబ భవిష్యత్ కోసం ఏమి కూడబెట్టరు. క్యాబ్ డ్రైవర్ల సమస్యలపై కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన విధానాలు రూపొందించి న్యాయం చేస్తాయి’ అని తన ట్వీట్లో స్పష్టం చేశారు. ‘డ్రైవర్లకు సామాజిక భద్రత ఉండటం లేదు.
రైడ్స్ అంత ఈజీగా బుక్ కావడం లేదు. బుక్ అయినా తక్కువ కవి•షన్ వొస్తుంది. తక్కువ వేతనంతో జీవనం కొనసాగిస్తున్నాం. ఒకానొక సందర్భంలో సొంత ఊరికి వెళదామని అనుకున్నా. క్యాబ్ నడిపి దిల్లీలో జీవించడం కష్టమని తెలిసింది అని’ క్యాబ్ డ్రైవర్ సునీల్ ఉపాధ్యాయ్ తనకు వివరించినట్లు రాహుల్ గాంధీ అన్నారు. రాహుల్ గాంధీ రైడ్ ముగిసిన తర్వాత డ్రైవర్ పిల్లలకు బహుమతి అందజేశారు. ఆ మరుసటి రోజు క్యాబ్ డ్రైవర్ కుటుంబంతో రాహుల్ గాంధీ భోజనం కూడా చేశారు. క్యాడ్ డ్రైవర్ల గురించి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలు డ్రైవర్ల కుటుంబాలకు సామాజిక భద్రత కల్పించాలని అనుకుంటున్నాయని, ఆ విధానం దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోరతామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. డ్రైవర్ల జీవన ప్రమాణ స్థాయి పెంచేందుకు కృషి చేస్తామని రాహుల్ గాంధీ భరోసానిచ్చారు. ప్రతిపక్ష నేత హావి•తో క్యాబ్ డ్రైవర్ల ఒకింత సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు.