ఎల్బీనగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 29: చదువు తో పాటు క్రీడల్లో రాణిస్తే విద్యార్థిని విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే
దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయి టార్గెట్ బాల్ పోటీలలో తెలంగాణ రాష్ట్రం నుండి ఎల్.బి.నగర్ నియోజకవర్గనికి చెందిన విద్యార్థులు తమ సత్తాను చాటారు. నేపాల్ దేశంలో ఇటీవల జరిగిన జాతీయ స్థాయి టార్గెట్ బాల్ పోటీలలో లాస్య, శరత్ కళ్యాణ్ లు తమ ప్రతిభను చాటారు. శుక్రవారం విద్యార్థులు ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని కలిశారు. ఈ సందర్బంగా సుధీర్ రెడ్డి విద్యార్థులను అభినందించారు. టార్గెట్ బాల్ పోటీల్లో లాస్యకు బంగారు పతకం, శరత్ కళ్యాణ్ కు సిల్వర్ పతకం రావడం జరిగిందని తెలిపారు. వీరు ఇద్దరు ఎల్.బి.నగర్ నియోజకవర్గనికి కావడం ఎంతో గర్వించదగ్గ విషయం అని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలిపారు. రాబోయే రోజుల్లో వీరు మరిన్ని పతకాలు సాధించి దేశానికి మంచిపేరు తేవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. మా యొక్క సహాయ, సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. నేపాల్ దేశంలో జాతీయ ఆటగా టార్గెట్ బాల్ కు మంచి గుర్తింపు ఉందన్నారు. అలాగే చదువు మీద కూడా దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సుంకోజు కృష్ణమాచారి, నిష్కాంత్ రెడ్డి, కోచ్ నందు ఉమ శంకర్ తదితరులు పాల్గొన్నారు.