క్రైస్తవ సమాజ సంపూర్ణ ప్రగతికి  రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది

 ఉప్పల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 18:  క్రైస్తవ సమాజ సంపూర్ణ ప్రగతికి,  సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఎల్లవేళలా కట్టుబడి ఉందని ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. క్రైస్తవుల మనోభాలాన్ని పెంచి  సగర్వంగా అభివృద్ధి పథలో నడిపించేందుకు సీఎం కేసీఆర్ అనేక ప్రోత్సాహాలు అందిస్తున్నారని బిఆర్ఎస్ పార్టీ మాజీ రాష్ట్ర  కార్యదర్శి , కంటోన్మెంట్ మాజీ ఇన్చార్జి గొల్లూరి అంజయ్య స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కుషాయిగూడ 
ఫాస్టర్స్   ఫెలోషిప్   వారి ఆధ్వర్యంలో కాప్రా ఆదర్శ్ నగర్ కాలనీ చర్చ్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనలో  బండారి లక్ష్మారెడ్డి,  గొల్లూరి అంజయ్య    తో కలిసి ప్రత్యేక ప్రార్థనలు  నిర్వహించారు.ఈ సందర్భంగా కొల్లూరు అంజయ్య మాట్లాడుతూ క్రైస్తవ సమాజ సంపూర్ణ ప్రగతికి మరియు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఎల్లవేళలా కట్టుబడి ఉందని, ప్రభుత్వం తీసుకున్న ఏన్నో నిర్ణయాలు రుజువుగా నిలుస్తున్నాయి.క్రైస్తవుల మనోబలాన్ని పెంచి, సగర్వంగా అభివృద్ధి పథంలో పయనించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్   అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నారని తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గం బి ఆర్ ఎస్   పార్టీ తరపున తరపున ఎన్నికైనటువంటి ప్రజానాయకుడు బండారి లక్ష్మారెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రజా నాయకుడు ప్రజలు మెచ్చిన నాయకుడు ఆపదలో ఉన్న ప్రజలందరికీ నేనున్నాను ధైర్యం చెప్పి సేవలు అందిస్తున్న బండారి లక్ష్మారెడ్డి  ఉప్పల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా రావడం అభినందనీయం అని అన్నారు. వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు వారి నాయకత్వ లక్షణానికి నిదర్శనం అని తెలిపారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులు వారి సమస్యల గురించి బండారి లక్ష్మారెడ్డి కి వినతి పత్రం అందజేసి వారి సమస్యల గురించి తెలియజేశారు. బండారి లక్ష్మారెడ్డి  సానుకూలంగా స్పందించి వారి సమస్యల పరిష్కారానికి తోడ్పడుతానని వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవా కార్యక్రమాలు చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు , యువజన నాయకులు మహేష్ గౌడ్ , ప్రెసిడెంట్ S.రాజు  , దైవ సేవకులు పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page