క్షీర విప్లవం, సోమవారం ఒక భోజనం, జై జవాన్‌ జై కిసాన్‌

నేడు లాల్‌ బహదూర్‌ 120 జయంతి

ఆ కుంటుంబానికి ఏవిధమైన స్వాంత్య్రోద్యమ నేపధ్యం లేనప్పటికీ ఆయన చదివే హరిష్‌ చంద్ర హైస్కూల్‌ ఉపాద్యాయులలో ఒకరైన నిశ్మేమేశ్వర ప్రసాద్‌ మిశ్రా ద్వారా లాల్‌ బహదూర్‌ శాస్త్రి లో దేశభక్తి కలిగింది. ఆ ఉపాద్యాయుడు ఆయన పిల్లలకు శాస్త్రిని శిక్షకునిగా నియమించి ఆర్థిక సహాయం అందించారు. మిశ్రా దేశభక్తి ప్రేరణగా పొందిన శాస్త్రి, స్వాతంత్య్రోద్యమంపై మక్కువ పెంచుకుని, తరువాత స్వామి వివేకానంద, గాంధీజీ, అనీబిసెంట్‌ వంటి వ్యక్తుల చరిత్ర, వారు చేసిన సేవలను గూర్చి అధ్యయనం చేసారు. లాల్‌ బహదూర్‌ శాస్త్రి 1904 అక్టోబరు 2న రాందులారి దేవి, శారద ప్రసాద్‌ శ్రీవాస్తవ దంపతులకు యునైటెడ్‌ ప్రావిన్సెస్‌ (నేటి ఉత్తరప్రదేశ్‌)లోని మొఘల్‌సరాయ్‌లో జన్మించారు. ఆయన తన పుట్టినరోజును జాతిపిత మహాత్మా గాంధీతో పంచుకున్నారు. అయన అక్క కైలాష్‌ దేవి. చెల్లెలు సుందరీ దేవి. తండ్రి మరణానంతరం శాస్త్రి ఆమె సొదరీమణులతో కలసి తాతగారైన హజారీ లాల్‌ ఇంటిలో పెరిగారు. ముఘల్‌సరాయ్‌ లోని తూర్పు మధ్య రైల్వే ఇంటర్‌ కళాశాలలో 6వ తరగతి వరకు చదివారు. 1921 జనవరిలో 10వ తరగతి చదువుతున్నప్పుడు పరీక్షలకు మూడు మాసాల వ్యవధి ఉన్న సమయంలో బెనారస్‌ లో మహాత్మా గాంధీ, పండిట్‌ మదన్‌ మోహన్‌ మాలవీయ నిర్వహించిన సభకు హాజరై మహాత్మా గాంధీ పిలువుకు ప్రేరణ పొంది పాఠశాలలను వదలి సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. రెండవరోజే శాస్త్రి స్థానిక కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో కార్యకర్తగా చేరారు. చురుకుగా అనేక ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలలో పాల్గొన్న కారణంగా ఆయనను అరెస్టు చేసినా మైనర్‌ అయినందువలన విడిచిపెట్టారు.

బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం అధ్యాపకుడు జె.బి.కృపాలానీ శాస్త్రికి సూపర్‌వైజర్‌ గా వ్యవహరించారు. కృపాలానీ స్వాతంత్య్రోద్యమంలో గాంధీని అనుసరించిన్‌ ప్రముఖ నాయకులలో ఒకడు. చదువు వదిలి స్వాతంత్య్రోద్యమంలోకి వచ్చిన యువ కార్యకర్తలు తమ విద్యను కొనసాగించడానికి కృపాలానీ స్నేహితుడు వి.ఎన్‌.శర్మతో కలసి అనియత పాఠశాలను స్థాపించారు. కాంగ్రెస్‌ జాతీయవాది శివప్రసాద్‌ గుప్తా మద్దతుతో 1921 ఫిబ్రవరి 10న బెనారస్‌ లో స్థాపించిన ఉన్నత విద్యా సంస్థ (కాశీ విద్యా పీఠ్‌) ను గాంధీజీ ప్రారంభించారు. 1925లో విద్యాపీఠ్‌ మొదటి బృందం విద్యార్థులలో శాస్త్రి తత్త్వశాస్త్రం, నీతి శాస్త్రాలలో మొదటి శ్రేణిలో గ్రాడ్యుయేషన్‌ పట్టా పొందారు. లాల్‌ బహదూర్‌ ప్రబలంగా ఉన్న కులవ్యవస్థకు వ్యతిరేకం కాబట్టి తన ఇంటిపేరు వదులుకోవాలని చిన్నతనంలోనెనిర్ణయించుకున్నారు. 1925లో వారణాసిలోని కాశీ విద్యాపీఠంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన తర్వాత ‘‘శాస్త్రి’’ అనే బిరుదు లభించింది. అదే ఆయన పేరులో ఇమిడి శాస్త్రీ జీ గా ప్రజల గుండెల్లో నిలిచిపోయరు. 1928లో గాంధీజీ పిలుపుతో కాంగ్రెస్‌ లో చురుకైన, పరిపక్వత గల సభ్యునిగా మారాడు. 1930 లో ఉప్పు సత్యాగ్రహం లో అతను పాల్గొన్నాడు. దాని ఫలితంగా రెండున్నర సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. తరువాత 1937 లో ఉత్తర ప్రదేశ్‌ పార్లమెంటరీ బోర్డులో ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా పనిచేసాడు. 1940 లో అతను స్వాతత్య్ర ఉద్యమానికి మద్దతుగా వ్యక్తిగత సత్యాగ్రహం నిర్వహించినందున ఒక సంవత్సరం పాటు జైలు లో ఉన్నాడు.

1942 ఆగస్టు 8 న దేశ వ్యాప్తంగా ఆంగ్లేయులు భారతదేశ్‌ం విడిచి పోవాలనే డిమాండ్‌ తో గాంధీజీ ముంబై గోవిలియా టాంక్‌ వద్ద క్విట్‌ ఇండియా ఉద్యమ సందేశాన్నిచ్చారు. శాస్త్రి ఒక ఏడాది జైలుశిక్ష అనుభవించి విడుదలైన వెంటనే అలహాబాదుకు ప్రయాణమై జవహర్‌ లాల్‌ నెహ్రూ గృహం ఆనందభవన్‌లో స్వాతంత్య్ర ఉద్యమకారులకు ఒక వారంపాటు సూచనలు పంపారు. కొద్ది రోజుల తరువాత తిరిగి అరెస్తయి 1946 వరకు కారాగారంలో గడిపారు. స్వాతంత్యోద్యమంలో మొత్తం 9 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన వ్య్క్తి శాస్త్రి. జైలులో ఉన్నకాలాన్ని పుస్తకాలు చదవడంతో గడిపి, పశ్చిమ దేశ తత్వవేత్తలు, విప్లవకారులు, సాంఘిక సంస్కర్తల కృషి తెలుసుకున్నారు. 1947 ఆగస్టు 15 న గోవింద్‌ వల్లభ్‌ పంత్‌ మంత్రివర్గంలో పోలీసు, రవాణా శాఖలకు శాస్త్రి మంత్రిగా వ్యవహరించారు. రఫీ అహ్మద్‌ కిద్వాయ్‌ నిష్క్రమణ తరువాత కేంద్రంలో మంత్రిగా చేరారు. రవాణా శాఖా మంత్రిగా ఉన్నప్పుడు మొదటి సారి మహిళా కండక్టర్ల నియంకం ప్రారంభించారు. పోలీసు మంత్రిగా ఎక్కువగా జనసమూహాలు చెదరగొట్టేందుకు లాఠీ చార్జ్‌ బదులుగా వాటర్‌ జెట్‌ వాడాలని ఆదేశించారు. 1951లో శాస్త్రి జవహర్‌ లాల్‌ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ కమిటీకి ప్రధాన కార్యదర్శిగా, ప్రచారం, ఎన్నికల కార్యకలాపాలు, అభ్యర్థుల ఎంపికకు పూర్తి బాధ్యత వహించారు. 1952, 1957, 1962 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించడంలోముఖ్య పాత్ర పోషించారు. 1952 లో ఉత్తర ప్రదేశ్‌ సోరాన్‌ ఉత్తర (ఫూల్పూర్‌ పశ్చిమ) విధాన సభ నియోజక వర్గం నుండి పోటీ చేసి 69% ఓట్లతో విజయం చినప్పుడు ఉత్తరప్రదేశ్‌ హోం మంత్రిగా పదవి లభిస్తుందనుకున్నారు కానీ నెహ్రూ పిలుపు మేరకు తిరిగి కేంద్ర ప్రభుత్వంలో చేవ్రారు. 1952 మే 13న నెహ్రూ మొదటి కేబినెట్‌ లో శాస్త్రి రైల్వే మంత్రిగ బాధ్యతలు చేపట్తారు.1964లో అప్పటి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ మరణం తరువాత అతని స్థానాన్ని పూరించడానికై, లాల్‌ బహదూర్‌ శాస్త్రి, మొరార్జీదేశాయ్‌ సిద్దంగా ఉండగా, అప్పటి కాంగ్రేసు పార్టీ ప్రెసిడెంటు కామరాజ్‌ సోషలిస్టు భావాలున్న లాల్‌ బహదూర్‌ శాస్త్రికి మద్దతుపలికి ప్రధానమంత్రిని చేయడంలో సఫలీకృతుడయ్యాడు. లాల్‌ బహాదుర్‌ శాస్త్రి ప్రధానమంత్రి అయ్యేనాటికి దేశంలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొని ఉంది. దీర్ఘకాలిక పరిష్కారానికై దేశంలో వ్యవసాయ విప్లవానికై (గ్రీన్‌ రెవల్యూషన్‌) బాటలుపరిచారు. కేంద్ర ప్రణాళికతో నెహ్రూ సోషలిస్టు ఆర్థిక విధానాలను శాస్త్రి నిలిపివేశాడు. అతను వైట్‌ విప్లవాన్ని(వైట్‌ రివల్యూషన్‌) ప్రోత్సహించారు.

దేశవ్యాప్తంగా దీర్ఘకాలిక ఆహార కొరత గమనించి స్వచ్ఛందంగా ప్రతివారూ వారంలో ఒక పూట భోజనం స్వీక్రించవద్దని కోరారు. ఫలితంగా ఆహార కొరత గల ప్రజలకు కూడా ఆహారం దొరుకుందని వివరించారు. ఆ విజ్ఞప్తికి విశేషమైన ప్రతిస్పందన వచ్చింది. ఫలితంగా దేశవ్యాప్తంగా రెస్టారెంట్లు, తినుబండారాల దుకాణాలు ప్రతీ సోమవారం సాయంత్రం మూసివేశారు. దేశంలో అనేక ప్రాంతాలు ‘‘శాస్త్రి వ్రత్‌’’ ను పాటించాయి. దేశ రాజధాని అధికార నివాసంలోని పచ్చిక మైదానాన్ని దున్ని తద్వారా ఆహార ధాన్యాల ఉత్పత్తి పెంచడానికి దేశ ప్రజలకు ప్రేరణ కలిగించారు. రైతుకు, సైనికునికి ప్రాధాన్యం ఆయన చలవే. 1965 ఆగస్టులో పాకిస్తాన్‌ ఆక్రమణ గురించి తెలుసుకున్న లాల్‌ బహదూర్‌ శాస్త్రి వెంటనే త్రివిధ దళాలకు నియంత్రణ రేఖను దాటి లాహోరును ఆక్రమించుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేశారు.భారత సైన్యం విజయ దుందుభికి చేరువలో ఉండగా శాస్త్రిపై అమెరికా తీవ్ర ఒత్తిళ్లు తెచ్చింది. 1965 యుద్ధం తీవ్రస్థాయికి చేరిన సమయంలో పాకిస్థాన్‌- అమెరికా, భారత్‌- అమెరికా మధ్య జరిగిన పలు దౌత్య కార్యక్రమాలు జరిగాయి. పాకిస్తాన్‌ పాలకులు తాము యుద్ధ బాధితులమని అమెరికాకు, ఐక్యరాజ్యసమితి కూడా ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు. పాక్‌ వాదనను అమెరికా కొట్టిపారేసినట్లు వెల్లడైంది. అదే సమయంలో నాటి భారత ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రి అమెరికా అధ్యక్షుడు లిండన్‌ జాన్సన్‌కు లేఖ రాశారు. ఐరాస తీర్మానానికి ఏనాడో కాలం చెల్లిపోయిందని, కశ్మీర్‌లో ప్రజాభిప్రాయ సేకరణకు అవకాశమేలేదని కరాఖండిగా చెప్పారు. బేషరతుగా కాల్పుల విరమణను పాటించేందుకు తాము సిద్ధమేనని తెలిపారు. ‘‘జైజవాన్‌, జైకిసాన్‌’’ ఆయన నినాదమే.1965 లో పాకిస్తాన్తో కాల్పుల విరమణ ప్రకటించిన తరువాత, శాస్త్రి, అయుబ్‌ ఖాన్‌ తాష్కెంట్‌ లో జరిగిన ఒక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. దీనిని అలెక్సీ కోసైజిన్‌ నిర్వహించాడు. 1966 జనవరి 10 న శాస్త్రి, ఆయూబ్‌ ఖాన్‌ తాష్కెంట్‌ ఒప్పందంపై సంతకాలు చేసారు. ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వం మేరకు సోవియట్‌ లోని టాష్కెంట్లో ఒప్పందం పై సంతకం చేసి అక్కడే మృతిచెందారు. తాష్కెంట్‌ ఒప్పందం పై సంతకం చేసిన రోజు అర్థరాత్రి తాష్కెంట్‌ లో శాస్త్రి గుండెపోటుతో మరణించినట్లు ప్రకటించారు. కానీ ఆయన మరణం వెనుక కుట్ర ఉందని ప్రజలు అనుమానించారు. విదేశంలో చనిపోయిన భారతదేశ మొదటి ప్రధాన మంత్రి ఆయనే. ఆయనను జాతీయ నాయకునిగా శ్లాఘిస్తూ వారి జ్ఞాపకార్థం విజయఘాట్‌ లో స్మారకం ఏర్పాటు చేసారు.
– నందిరాజు రాధాకృష్ణ, వెటరన్‌ జర్నలిస్ట్‌, 98481 28215.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page