చచ్చిపోతున్న బతుకుకు
లేదిక ఉపశమనం
శవాలై దివాలై జీవచ్ఛవాలై
మారణహోమంలో సలసల మరిగే
రక్తపు బిందువుల మాడు కుంపట్లో
ఒక ఇంట్లో దేహపు గూట్లో
పసిరిక దీపం వెలిగిస్తానంటే
ఓ ఓరీ ఓయీ ఓసీ…
నీ మెదడే మొద్దుబారిన దిబ్బ
నీ కలలే కబ్రస్తాన్ కట్టడాలు
నీ చుట్టూ స్మశానవాటికలు
దహనం ఖననం పుట్టుకతో
వెంటొచ్చినయ్
కర్రలతో ఒక కళాఖండం
తయారు చెసుకో
స్వయంగా నీ చేతులతో…
నీ శరీరాన్ని ఎక్కించి
తీసుకుపోవడానికిజి
లేదా ఒక చెక్కపెట్టెనో…
ఓ గుడ్డ తొడిగించి నీకు తీసుకెళ్తారు
డప్పులో మంత్రాలో నమాజో ప్రార్థనో
ఇంకేదో… మౌనమో గుసగుసనో…
నిన్ను మోస్తాయి!
నిన్ను పాపం అనే నోర్లు మెదళ్ళు
హృదయాలు కళ్ళు చూస్తుంటాయ్
నువ్వు కనుమరుగయ్యే వరకు…
చివరికన్నా నిన్ను ఒక్కరన్నా
భలే మంచోడో మంచిదో అని
అంటారు తప్పక!
నువ్వు వింటావా..?
మట్టిలోకెళ్ళి…
లేక బూడిదలా అయ్యి…
అయ్యో..!
బ్రతికున్నన్నాళ్ళూ బతికున్న శవానివి
ఇప్పుడేమో మరణించిన గతానివి
కాలం నాలికపై ఎప్పుడూ…
రామ్ నామ్ సత్య్ హై
బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్
ఆమెన్
– రఘు వగ్గు
మొబైల్: 9603245215