ఖమ్మంలో సమీకృత కలెక్టరేట్‌ ‌ప్రారంభోత్సవం

  • ‘కంటి వెలుగు’కూ ఖమ్మంలోనే శ్రీకారం…
  • లబ్దిదారులకు అద్దాలు అందచేసిన పంజాబ్‌ ‌సిఎం
  • జాతీయ నేతలతో కలసి ప్రారంభించిన సిఎం కెసిఆర్‌

ఖమ్మం: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగగా నిర్మించిన ఖమ్మం సమీకృత కలెక్టరేట్‌ను, రెండత విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు కేరళ, దిల్లీ, పంజాబ్‌ ‌ముఖ్యమంత్రులు విజయన్‌, అరవింద్‌ ‌కేజీవ్రాల్‌, ‌భగవంత్‌ ‌మాన్‌తో పాటు యూపీ మాజీ ముఖ్యమంత్రి, సీపీఐ జాతీయ నేత డీ రాజా ప్రారంభోత్సవం చేశారు. వీరితో కలసి కెసిఆర్‌ ‌ప్రారంభించారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. నూతనంగా నిర్మించిన కలెక్టరేట్‌ ‌గురించి జాతీయ నేతలకు సీఎం కేసీఆర్‌ ‌వివరించారు. ఆ తర్వాత కలెక్టరేట్‌ ‌శిలాఫలకాన్ని ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం చాంబర్‌లో కలెక్టర్‌ ‌వీపీ గౌతమ్‌ను కూర్చుండబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. పరిపాలనా సౌలభ్యం, ప్రభుత్వ పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్‌ ‌కొత్త జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లను నిర్మించాలని భావించారు.ఆ తర్వాత భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఇప్పటికే పలు జిల్లాల్లో కార్యాలయాలు అందుబాటులోకి వొచ్చాయి.

మరికొన్ని పూర్తి కావచ్చాయి. ఇందులో భాగంగానే ఖమ్మం
వైరా ప్రధాన రహదారి వీ వెంకటాయపాలెం వద్ద కొత్త కలెక్టరేట్‌ను నిర్మించింది. ఖమ్మం సమీకృత కలెక్టరేట్‌ను రూ.53.20 కోట్ల వ్యయంతో నిర్మించింది. అన్ని వసతులతో అత్యంత సౌకర్యవంతంగా సమీకృత కలెక్టరేట్‌ ‌రూపుదిద్దుకున్నది. అంతకు ముందు యాదాద్రి నుంచి హెలీకాప్టర్లలో ఖమ్మం చేరుకున్న ముఖ్యమంత్రులు, జాతీయ నేతలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి ఖమ్మం కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఖమ్మం కొత్త కలెక్టరేట్‌ ‌కార్యాలయాన్ని సీఎం కేసీఆర్‌ ‌ప్రారంభించారు. కేరళ సీఎం పినరయి విజయన్‌ ‌కలెక్టరేట్‌ ‌భవన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ల్లీ సీఎం అరవింద్‌ ‌కేజీవ్రాల్‌ ‌బిల్డింగ్‌ ‌రిబ్బన్‌ ‌కట్‌ ‌చేశారు. కలెక్టర్‌ ‌గౌతమ్‌ ‌ను సీట్లో కూర్చోబెట్టి శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం అతిథులుగా వచ్చిన నేతలందరికీ కలెక్టర్‌ ‌కార్యాలయాన్ని చూపించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ ‌తిలకించారు.

‘కంటి వెలుగు’కూ ఖమ్మంలోనే శ్రీకారం… లబ్దిదారులకు అద్దాలు అందచేసిన పంజాబ్‌ ‌సిఎం
రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్‌తో పాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్‌ ‌ముఖ్యమంత్రలు పినరయి విజయన్‌, అరవింద్‌ ‌కేజీవ్రాల్‌, ‌భగవంత్‌ ‌మాన్‌తో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ ‌యాదవ్‌, ‌సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా ప్రారంభించారు. కలెక్టరేట్‌లో మొదట నేతలు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం రెండో విడుత కంటి వెలుగుకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కంటి వెలుగు లబ్దిదారులు ధరవాత్‌ ‌బిచ్చమ్మ, మందా అన్నపూర్ణ, రామనాథం, కోలం జ్యోతి, వెంకటేశ్వర్లు, షేక్‌ ‌గౌసియా బేగంకు నేతలు సీఎం పినరయి విజనయ్‌, అరవింద్‌ ‌కేజీవ్రాల్‌ ‌భగవంత్‌ ‌మాన్‌, ‌సీఎం కేసీఆర్‌, అఖిలేశ్‌ ‌యాదవ్‌, ‌డీ రాజా కంటి అద్దాలను అందజేశారు. ఈ సందర్భంగా కంటి వెలుగు కార్యక్రమం గురించి జాతీయ నేతలకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వివరించారు.

రాష్ట్రంలో అంధత్వ వ్యాధులను పూర్తి స్థాయిలో నిర్మూలించడంతో పాటు కళ్లల్లో కాంతులు నింపాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ ‌ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తొలిసారిగా లక్షలాది మందికి కంటి పరీక్షలు నిర్వహించి అక్కడికక్కడే మందులు, కళ్లద్దాలు అందజేశారు. సమస్య తీవ్రత ఆధారంగా ఆపరేషన్ల నిమిత్తం మరికొందరిని ప్రభుత్వ, ప్రైవేట్‌ ‌దవాఖానలకు సిఫారస్‌ ‌చేశారు. తాజాగా రెండో విడతకు శ్రీకారం చుట్టింది. రెండో విడత కార్యక్రమం ప్రారంభం సందర్భం గా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ యంత్రాంగం కొత్త కలెక్టరేట్‌లో విస్తృత ఏర్పాట్లు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page