బాధితులకు అండగా ఉంటామని భరోసా
ఎడతెరిపి లేకుండా రెండు రోజుల పాటు కురిసిన వర్షాలకు అతలకుతాలమైన ఖమ్మం రూరల్ మండల వరద ప్రభావిత ప్రాంతాల్లో సోమవారం ఉదయం పర్యటించారు. మండలంలోని నాయుడుపేట, జలగంనగర్, సాయి ప్రభాత్ నగర్ -1,2, టెంపుల్ సిటీ, పెద్దతండా, కరుణగిరి, రాజీవ్ గృహకల్ప ప్రాంతాలను సందర్శించారు. బాధితులను ఓదార్చారు. కొంతమంది మహిళలు వారి ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఖచ్చితంగా బాధితులందరినీ ఆదుకుంటామని, ఏ ఒక్కరికి ఇబ్బందులు కలిగించబోమని మంత్రి పొంగులేటి బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు.