ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 5 : త్వరలో జరగబోయే ఎన్నికల దృశ్య కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అమలు చేస్తున్న కాంగ్రెస్ డిక్లరేషన్ ను యూత్ కాంగ్రెస్ నాయకులు గడపగడపకు వెళ్లి ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. శనివారం ఆమనగల్లు లో యూత్ కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రవికాంత్ గౌడ్, నియోజకవర్గ అధ్యక్షులు రాపోతు అనిల్ గౌడ్ ల ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి యూత్ కాంగ్రెస్ వెన్నెముక లాంటిది అని బూత్ స్థాయి లో పనిచేయడంలో యువజన కాంగ్రెస్ నాయకులు ముందుండాలన్నారు. రేపటి నుంచి కాంగ్రెస్ హామీలని గడప గడపకు తీసుకెళ్ళాలని , బిఆర్ఎస్ , బిజెపి ల మోసాలని వివరించాలన్నారు. కాంగ్రెస్ గెలుపు కోసం ఈ 4 నెలలు మనందరం నిరంతరం శ్రమించాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో కల్వకుర్తి లో కాంగ్రెస్ పార్టీ జెండా ను ఖచ్చితంగా ఎగరవేద్దామని భరోసా ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రవికాంత్ గౌడ్, అసెంబ్లీ అధ్యక్షుడు అనిల్ గౌడ్ లు మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డోర్ టు డోర్ క్యాంపెయిన్ ని ప్రతి గ్రామంలో కొనసాగించాలని, విత్ ఐవైసి యాప్ ద్వారా ప్రతి గడప గడప వివరాలు నమోదు చేయాలని, యాప్ గురించి వివరించారు.ఈ సందర్భంగా పలువురు ఆమనగల్ యువకులు రాఘవేందర్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు గుజ్జుల మహేష్, ఆమనగల్ బ్లాక్ ప్రధాన కార్యదర్శి శ్రీరాములు, ఆమనగల్లు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అండేకర్ రాజశేఖర్, మాడ్గుల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దళపతి గౌడ్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ కార్యదర్శి జంగయ్య గౌడ్, గట్టిప్పలపల్లి యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శివ, కడ్తాల్ పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు భానుకిరణ్ ,యూత్ కాంగ్రెస్ నాయకులు శ్రీపతి, గౌని సురేష్ గౌడ్ ,నవీన్ , అభినవ్ , రమేష్, వసురాం, ఆంజనేయులు,ఇమ్రాన్, మల్లేష్, సైదులు, గణేష్, చందు, హాసన్, సురేష్ నాయక్, శివ , రాజేష్ , రాజేందర్,నరేష్, వెంకటేష్, ప్రకాష్ , భరత్ , ప్రవీణ్ నాయక్ ముడావత్, శ్రీను, మహేష్, సాజిద్, శ్రీధర్, నవీన్, రాజ్ కుమార్, నరేష్, యాదయ్య , రాంబాబు తదితరులు పాల్గొన్నారు.