గతేడాదికన్నా 2 శాతం పెరిగిన నేరాలు

హత్యలు తగ్గినా.. పెరిగిన స్థిరాస్థి కేసులు..
మహిళలపై పెరిగిన అఘాయిత్యాలు
 రాత్రి 1గంట వరకే న్యూఇయర్‌ వేడుకలు..
తాగి దొరికితే డ్రంకెన్‌ డ్క్రెవ్‌ కేసు నమోదు
 పబ్బులకు తిరిగి అనుమతించే ప్రసక్తి లేదు..
డ్రగ్స్‌ వినయోగంపై ఉక్కుపాదం
 నగర క్రైమ్‌పై వార్షిక నివేదిక విడుదల చేసిన సిపి శ్రీనివాసరెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబ్‌ 22 : 2022తో పోలిస్తే ఈ ఏడాది 2 శాతం నేరాలు పెరిగాయని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో జరిగిన నేరాలపై వార్షిక నివేదకను సిపి శ్రీనివాస రెడ్డి విడుదల చేశారు. స్థిరాస్తి నేరాలు మూడు శాతం పెరిగాయని, ఈ ఏడాదిలో మహిళలపై నేరాలు పెరిగాయని, సామాజిక మాధ్యమాల ద్వారా వొచ్చే ఫిర్యాదులను వేగంగా పరిష్కరిస్తున్నామని, పొక్సో కేసులు 12 శాతానికి తగ్గాయని, లా అండ్‌ ఆర్డర్‌ పోలీస్‌ స్టేషన్ల కన్నా ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్లు పెరిగాయని సిపి వెల్లడిరచారు. సైబర్‌ సెక్యూరిటీపై నిపుణులను పిలిచి అవగాహన కల్పించామని, ఈ ఏడాది అన్ని పండుగలు, ర్యాలీలు ప్రశాంతంగా నిర్వహించామన్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించామని, ట్రాఫిక్‌లో కూడా త్వరలో మరికొన్ని పిఎస్‌లు వొస్తాయని సిపి తెలియజేశారు. దేశంలో తొలిసారిగా ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేశామని, నార్కోటిక్‌ బ్యూరో ఏర్పాటు చేసుకున్నామని, హైదరాబాద్‌ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్‌ సహకారంతో సదస్సులు నిర్వహించామని పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌ కమిషనరేట్‌లో నగర వార్షిక నేర నివేదికను సిపి విడుదల చేశారు.

చాలాకాలం తర్వాత ఈ ఏడాది గణెశ్‌ నిమజ్జనోత్సవం, మిలాద్‌ ఉన్‌ నబీ ఒకేసారి రావడంతో మత పెద్దల సహకారంతో ప్రశాంతంగా నిర్వహించామని చెప్పారు. మహిళలపై అత్యాచార కేసులు 2022లో 343 ఉంటే.. ఈ ఏడాది 403 నమోదయ్యాయన్నారు. సైబర్‌ నేరాలు 11 శాతం పెరిగాయన్నారు. గతేడాది సైబర్‌ నేరాల్లో రూ.82 కోట్ల మోసాలు జరిగితే, ఈసారి రూ.133 కోట్లను కేటుగాళ్లు కాజేశారని తెలిపారు. ఆర్థిక నేరాలపై 2022లో 292 కేసులు నమోద్కెతే.. 2023లో స్పల్పం (344)గా పెరిగాయ న్నారు పోక్సో కేసులు 12 శాతానికి తగ్గాయన్నారు. డ్రగ్స్‌ నిర్మూలనకు నార్కోటిక్‌ బ్యూరో తీవ్రంగా కృషి చేస్తుందని చెప్పారు. సరఫరా చేసే వాళ్లు ఎక్కడ ఉన్నా పట్టుకుంటామని, డ్రగ్స్‌ను గుర్తించేందుకు స్నిపర్‌ డాగ్స్‌ను వినియోగిస్తామని తెలిపారు. సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ఫిర్యాదులను వేగంగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో తిరిగి పబ్స్‌ ఓపెన్‌ చేయించే ప్రసక్తి ఉండదు అని సిపి స్పష్టం చేశారు. న్యూ ఇయర్‌ రోజు ఎవరైనా డ్రంక్‌ అండ్‌ డ్క్రెవ్‌ చేస్తే తగిన చర్యలు తీసుకుంటాని హెచ్చరించారు. రాత్రి ఒంటి గంట వరకు మాత్రమే ఈవెంట్స్‌, పబ్‌ లకు అనుమతి ఉందని శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. 12.30 గంటల నుంచే కష్టమర్లను బయటకి పంపాలన్నారు. న్యూ ఇయర్‌ వేడుకల్లో ఎక్కడ్కెనా డ్రగ్స్‌ సేవించినా, సప్లై చేసినట్లు తెలిసినా వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. న్యూ ఇయర్‌ వేడుకలపై పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెంచుతున్నామన్నారు. ఎవరైనా నిబంధన లు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరి స్తామని సిపి హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్‌ నిర్మూలనకు నార్కొటిక్‌ బ్యూరో తీవ్రంగా కృషి చేస్తుందని తెలిపారు. . సరఫరా చేసేవాళ్లు ఎక్కడ ఉన్నా వెతికిమరి పట్టికుం టా మన్నారు. డ్రగ్స్‌ గుర్తించేందుకు  స్నిఫర్‌ డాగ్స్‌ను వాడతామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలు సహా ఈ ఏడాది అన్ని పండుగలు ర్యాలీలను ప్రశాంతంగా నిర్వహించామని హైదరాబాద్‌ సీపీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. కానీ గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నేరాలు 2 శాతం పెరిగాయని వెల్లడిరచారు. ఈ ఏడాది 63 శాతం నేరస్తులకు శిక్షలు పడ్డాయని తెలిపారు. 13 కేసుల్లో 13 మందికి జీవిత ఖ్కెదు పడిరదన్నారు. ఇక సైబర్‌ నేరాలు 11 శాతం పెరిగాయని తెలిపారు. సైబర్‌ నేరాల కారణంగా గత ఏడాది రూ.82 కోట్ల మోసాలు జరిగితే.. ఈసారి రూ.133 కోట్లను కేటుగాళ్లు కాజేశారని తెలిపారు. పోగొట్టుకున్న సొత్తులో 75 శాతం రికవరీ చేశామని చెప్పారు. వివిధ కేసుల్లో జరిగిన నష్టం విలువ రూ.38 కోట్లు ఉంటుందన్నారు. ఈ ఏడాది 79 హత్యలు, 403 రేప్‌ కేసులు, 242 కిడ్నాప్‌ కేసులు, 4909 చీటింగ్‌ కేసులు నమోదయ్యాయని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page