గద్దర్ కు విప్లవ జోహార్లు..: మావోయిస్టు మాజీ నేత జంపన్న

భూస్వామ్య పెట్టుబడి దారి దోపిడీ అణిచివేత లకు వ్యతిరేకంగా తల ఎత్తిన నక్సల్ బరీ శ్రీకాకుళ విప్లవ తిరుగు బాటు లో ఆవిర్భవించిన విప్లవ గానమే గద్దర్.
 నక్సల్ బరీ శ్రీకాకుళ ఉద్యమాలు శతృవు దాడి లో దెబ్బ తినగా  పునర్ నిర్మాణం కోసం పీపుల్స్ వార్ వ్యవస్థాపకుడు  కామ్రేడ్ కొండపల్లి సీతారామయ్య 1974 లో  సాధారణ గాయకుడు అయిన విఠల్ రావును కలవడం జరిగింది.
కామ్రేడ్ కె యస్ నక్సల్ బరీ విప్లవ బోధనల ఫలితమే  గద్దర్ (విప్లవం) అనే  పేరుతో 5 దశాబ్దాల ప్రజా ఉద్యమాల ప్రస్థానం గా అమరుడు గద్దర్ జీవితం కొనసాగింది.
గద్దర్ సాహిత్యం లో గానం లో మాటల్లో పీడిత ప్రజల ఆవేదన అన్యాయాలు దోపిడీ అణిచివేత వివక్ష ల పై ఎక్కుపెట్టిన తిరుగుబాటు వున్నది దండ యాత్ర వున్నది.గద్దర్ అట పాట శత్రువు కు సవాల్ విసురుతూ అన్ని వర్గాల పీడిత ప్రజలను ప్రజా యుద్ధం లోకి సన్నద్ధం చేసిన తీరు గద్దర్ కు మాత్రమే భారత దేశం లో ప్రత్యేక మైనది.
గద్దర్ పాట ల్లో ఆవేదన దుఖం ప్రేమ కరుణ ఆవేదన ఆందోళన కోపం కసి దాడి తో కూడుకున్న విప్లవ శైలి గద్దర్ ఆవిష్కరించిన తీరు అమోఘమైనది.
గద్దరే జన నాట్య మండలి గా జన నాట్య మండలి గద్దర్ గా కొనసాగించిన విప్లవ గేయాల దుందుభి ఆంధ్ర తెలంగాణా మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రజల్లో చెరిగి పోని విప్లవ ముద్ర వేసింది.గద్దర్ పాటలు ఆంధ్ర తెలంగాన దండకారణ్యం లోని అన్ని గ్రామాల్లో మారు మ్రోగి నవి.
ఆంధ్ర తెలంగాన దండకారణ్యం లోని అనేక భూస్వామ్య పెట్టుబడి దారి వ్యతిరేక ఉద్యమాలకు విప్లవ పాట ముందు నడిస్తే ఆర్గనైజేషన్ వెనుకాల నడిచి గొప్ప విప్లవ ఉద్యమ నిర్మాణానికి కారణమైంది.
గద్దర్ సాహిత్యం గానం ఏ ఒక్క కులానికి లేదా వర్గానికి పరిమితం కాలేదు.భూస్వామ్య పెట్టుబడి దారి దోపిడీ కి గురి అయ్యే సమస్త వర్గాలను కులాలను వివిధ సెక్షన్ల ను కదిలించింది.కుల మత ప్రాంత లింగ సమస్యలను కమ్యునిస్ట్ రాజకీయాధికారం ద్వారా మాత్రమే పరిష్కరించ గలమని తిరుగుబాటు కు పురి కొల్పింది.
గద్దర్ సాహిత్యం లో చీపురు నుండి ఆయుధం వరకు అనేక వస్తువులు తిరుగుబాటు గుర్తులు అయినవి.
విప్లవ సాహిత్యం లో  విప్లవ గానం లో పేరెన్నిక గన్న వారు వున్నప్పటికీ గద్దర్ కు సాటి అయిన వారు లేరు. “నీ పాదం మీద పుట్టుమచ్చ నై వస్తున్న చెల్లెమ్మ ” పాటకు ప్రభుత్వ నంది అవార్డ్ ను తిరస్కరించి  ప్రజల గుండెల్లో గద్దర్ విప్లవ ప్రజా గాయకుడిగా  ప్రజా యుద్ద నౌక  గా చెరగని ముద్ర వేసినాడు.
కమ్యునిస్ట్ లు మాత్రమే కాదు వివిధ సంస్థకు పాడే పాటల్లో గద్దర్ అట పాట శైలి లను అనుకరిస్తూ వుండటమే గద్దర్ ప్రత్యేక శైలి ఆకర్ష నీయ మైనది.
గద్దర్ విప్లవ గానం లో విప్లవ గేయాల కు సామాజిక గేయాల కు ఎలాంటి వైరుధ్యం లేకుండా రాజ్యాన్ని ప్రశ్నించే విధంగా ప్రజల రాజకీయాది కారానికై తల పడే విధంగా ఉన్నవి.
గద్దర్ సాహిత్యం లో నిరాయుధమగా ఆయుధాలతో తిరుగుబాటు మాత్రమే కాకుండా ఓటు హక్కు తో కూడా పోరాడాలని ప్రజాస్వామిక పిలుపు లు వున్నాయి.
గద్దర్ సాహిత్యం లో మార్క్సిజం ను ప్రజల జీవితానికి అన్వయించి చెప్పిన తీరు  భారత దేశం లో గొప్ప సాహిత్యం గా నిలుస్తుంది.
గద్దర్ తన మాతృ సంస్థ అయిన మావోయిస్ట్ పార్టీ తో కొన్ని రాజకీయ పర మైన సమస్య ల కారణంగా ఆ పార్టీ కి దూరం అయినప్పటికీ పీడిత ప్రజల వర్గ దృక్పథానికి దూరం కాలేదు.
గద్దర్ ను అర్థం చేసుకోవడానికి ఈ మధ్య కాలం లో rtv లో ఇంటర్వ్యూ గద్దర్ మార్క్సిజం అంబేడ్కర్ సిద్దాంతం పై తన దైన శైలిలో ఇచ్చిన సందేశం భారత దేశం లో వర్గం కులం వుంది అనే విషయం చెపుతూ గద్దర్ పీడిత ప్రజల దృక్పథానికి ఎంత బలంగా అంకిత మైన తీరు చెపుతుంది.
 ఏ పార్టీ లో సభ్యుడు గా లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరంతరంగా ప్రజాస్వామిక సంస్థలు మొదలు కొని బూర్జువా పార్టీ ల వేదికల లో తన దైన రాజకీయ దాడి ని కొనసాగిస్తున్న తీరు ప్రజలకు ఆమోద మైనది.
తన రాజకీయ ఉపన్యాసాలలో పాటల్లో ప్రధానంగా పీడిత ప్రజల వర్గ దృక్పథానికి కట్టుబడి వున్నప్పటికీ కొన్ని బూర్జువా వాదానికి ఉపయోగ పడే అంశాలు కమ్యునిస్ట్ లు గా స్వీకరించ లేనివి వున్నాయి.
గద్దర్ 5 దశాబ్దాల గొప్ప విప్లవ ప్రయాణం చివరి కాలం లో కొన్ని తప్పటడుగులు వున్నంత మాత్రాన గద్దర్ బూర్జువా వ్యవస్థ లో భాగ మైన వ్యక్తిగా లేదు . ఏ బూర్జువా పార్టీ లో సభ్యుడు కాదు.తన దైన శైలిలో సంఘర్షణ పడుతూ అనేక రాజకీయ ప్రయత్నాల్లో వున్నాడు.
 గద్దర్ ఖచ్చితమైన పీడిత వర్గ దృక్పథం తో కూడిన కమ్యునిస్ట్ తిరుగుబాటు విప్లవ పోరాట తత్వాన్ని మరువలే ము.దోపిడీ అణిచివేత లు వివక్షలు వున్నంత వరకు గద్దర్ సాహిత్యం గానం చిరస్థాయిగా వుంటుంది.
నక్సల్ బరీ గానం పీడిత ప్రజల విప్లవ గాయకుడు కామ్రేడ్ గద్దర్ కు విప్లవ జోహార్లు
-జంపన్న

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page