ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 02 : గాడియం స్కూల్ నిర్వహించిన 2023 ఐఎస్ఎస్ఓ నేషనల్ గేమ్స్ జిమ్నాస్టిక్స్ విభాగంలో గాడియం స్కూల్ విద్యార్థులు అద్భుతమైన కనబర్చినట్లు గాడియం స్కూల్ ప్రతినిధులు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్బంగా హ్యూమన్ అథ్లెటిజం, ఫ్లెక్సిబులిటీ, ఆర్టిస్టిక్ ఎక్స్‌ప్రెషన్‌లతో కూడిన ప్రదర్శన, విజయాలను గుర్తించిన జిమ్నాస్టిక్స్ అవార్డులను ప్రదానం నిర్వహించినట్లు తెలిపారు. ఈ విభాగంలో రెండు విభిన్న వర్గాలు రిథమిక్, ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ లో పాల్గొనే క్రీడాకారులు ప్రతిభను కనబరిచారని పేర్కొన్నారు. ఇది రిథమిక్ జిమ్నాస్టిక్స్ అనేది బాలె, డాన్స్ అనే రెండు అంశాలనూ మిళితం చేసే క్రీడ అని అన్నారు. అథ్లెట్లు తమ ఆటతీరుతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారని చెప్పారు. అథ్లెటిక్స్, ఆర్టిస్ట్రీ లను ప్రదర్శించి చేసిన ఈ జిమ్నాస్టులను రిథమిక్ జిమ్నాస్టిక్స్ అవార్డులు వరించాయన్నారు. బ్యాలెన్స్ బీమ్, అన్ ఈవెన్ బార్స్, వాల్ట్, ఫ్లోర్ ఎక్సర్ సైజ్ లాంటి వాటితో అథ్లెట్లు తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారని పేర్కొన్నారు. క్రీడాకారుల ప్రతిభ వెనుక ప్రముఖ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ జిమ్నాస్టిక్స్ ఎక్స్ పర్ట్(ఎంఏజీ), భారతీయ జిమ్నాస్టిక్స్ జాతీయ జట్టుకు కోచ్ అయిన మనోజ్ రాణా ఒకరని అన్నారు. ఆయన ద గాడియం స్కూల్‌లో జిమ్నాస్టిక్స్ మెంటార్‌గా కీలకమైన పాత్ర పోషించారని తెలిపారు.