పటాన్‌చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 27: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని ఫార్మసీ విభాగం పరిశోధక విద్యార్థిని డి.సంతోషి ప్రియను డాక్టరేట్ వరించింది.లిక్విడ్ క్రోమాటో గ్రాఫిక్ పద్ధతులను సూచించే స్థిరత్వం ద్వారా బల్క్, ఫార్ములేషన్స్లో ఎంపిక చేసిన ఔషధాల విశ్లేషణ’పై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శివకుమార్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.ఔషధాల విశ్లేషణ కోసం సరళమైన, ఆర్థిక, ఖచ్చితమైన ఐసోక్రటిక్ RP UPLC, LC-MS పద్ధతుల అభివృద్ధిపై ఈ పరిశోధన దృష్టి సారించిందన్నారు.ఈ సద్ధతులు స్వచ్ఛత శాతం, ఔషధాల స్థిరత్వాన్ని అంచనా వేయడానికి వీలు కల్పిస్తాయని, తక్కువ సమయంలో మందులు, నిరుపయోగమైన పదార్థాలను వేరు చేసే సామర్థ్యం కలిగి ఉండి, ఆర్థికంగా లాభదాయకంగా చేస్తుందని తెలియజేశారు.సంతోషి ప్రియ సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్ డీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం, హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఫార్మసీ డీన్ ప్రొఫెసర్ జగత్తరణ్ దాస్, విశాఖపట్నం ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్.రాజా, నిశిష్ట ఆచార్యుడు ప్రొఫెసర్ సోడూరి రామారావు, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.